Imran Khan : నెయ్యితో చేసిన దేశీ చికెన్, మటన్, ఎయిర్ కూలర్...అదృష్టం అంటే నీదే సామి..!!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం (ఆగస్టు 28), ఇమ్రాన్ ఖాన్‌పై దేశద్రోహం కేసును పాకిస్థాన్ కోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే అటాక్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఇమ్రాన్ కు దేశీ నెయ్యితో చేసిన చికెన్, మటన్ అందిస్తున్నారట జైలు అధికారులు.

New Update
Imran Khan : నెయ్యితో చేసిన దేశీ చికెన్, మటన్, ఎయిర్ కూలర్...అదృష్టం అంటే నీదే సామి..!!

Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. సోమవారం (August 28) ఇమ్రాన్ ఖాన్‌పై దేశద్రోహం కేసును పాకిస్థాన్ కోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే అటాక్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ కు నెయ్యితో చేసిన దేశీ చికెన్, మటన్ అందిస్తున్నట్లు వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ఛైర్మన్‌కు అటాక్ జైలులో అతని ప్రొఫైల్, చట్టపరమైన స్టేటస్ ను పరిగణనలోకి తీసుకుని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పాకిస్తాన్ సుప్రీంకోర్టుకు సమాచారం అందిందని ది న్యూస్ ఇంటర్నేషనల్ నివేదించింది . వాస్తవానికి, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిని తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు నివేదిక కోరింది, ఆ తర్వాత జైలు పరిపాలన తరపున అటార్నీ జనరల్ కార్యాలయం కోర్టుకు ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: మహిళలల్లో గుండె పోటు లక్షణాలు ఇవే…పురుషులతో పోల్చితే ఎంత ప్రమాదం అంటే..?

అటాక్ జైలులో అత్యంత సురక్షితమైన నిర్బంధం బ్లాక్ నంబర్ 02. ఇందులోనే ఇమ్రాన్ ఖాన్ ఉంటుంది. ఇక్కడ అత్యంత భద్రతను ఏర్పాటు చేసినట్లు ది న్యూస్ ఇంటర్నేషనల్ నివేదించింది. 09x11 సైజులో గది ఏర్పాటు చేశారని...ఆ గదికి తెలుపు రంగు, సిమెంట్ వేసి సీలింగ్ చేసారని..ఎయిర్ కూలర్ అమర్చినట్లు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ఉపయోగించే టాయిలెట్‌ను 7x4 అడుగులకు పొడిగించారని, దాని గోడను ఐదు అడుగుల పొడిగించారని నివేదికలు చెబుతున్నాయి. దీనితో పాటు, 2-12x5 అడుగుల ఫైబర్ డోర్ కూడా ఇందులో అమర్చారు. కొత్త టాయిలెట్ సీటు, షవర్, టిష్యూ స్టాండ్, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాప్ ఏర్పాటు చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాదు స్నానం చేయడానికి, ముఖం కడుక్కోవడానికి పెద్ద గాజు వాష్ బేసిన్ కూడా ఏర్పాటు చేశారట.

ఇది కూడా చదవండి: పొగాకులో ఉండే ఈ సమ్మేళనం క్యాన్సర్‎తో పోరాడుతుంది: తాజా అధ్యయనం

ఇక ఇమ్రాన్ ఖాన్‌కు మంచం, నాలుగు దిండ్లు, ఒక టేబుల్, ఒక కుర్చీ, నమాజ్ చేయడానికి ఒక చాప, నిద్రించడానికి ఎయిర్ కూలర్ ఇచ్చారు. వార్తాపత్రికలే కాకుండా, ఖాన్‌కు ఇస్లామిక్ చరిత్రపై 25 పుస్తకాలతో సహా ఆంగ్ల అనువాదం, రీడింగ్ మెటీరియల్‌తో కూడిన నాలుగు పవిత్ర ఖురాన్ కాపీలు కూడా ఏర్పాటు చేశారు. ఇమ్రాన్ ఖాన్ కోరిక మేరకు, అతనికి వారానికి రెండుసార్లు దేశీ చికెన్ వడ్డిస్తున్నారని, నెయ్యిలో వండిన మటన్ అందిస్తున్నారని నివేదిక పేర్కొంది. పంజాబ్‌కు చెందిన 53 మంది జైలు సిబ్బందిని ఇమ్రాన్ కు భద్రతా సిబ్బందిగా కాపాలా కాస్తున్నారని తన నివేదికలో వెల్లడించింది.

Advertisment
తాజా కథనాలు