Jagtial District New Bride Incident: పెళ్లయి నెల కూడా గడవకముందే నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందింది. జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లికి చెందిన కనక భాగ్యలక్ష్మికి మ్యాడంపల్లికి చెందిన ఉదయ్‌కిరణ్‌తో ఆగస్టు 18న వివాహం జరిగింది. పెళ్లయిన వెంటనే హైదరాబాద్‌లో కాపురానికి వెళ్లింది. భర్త ఉదయ్‌కిరణ్ హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Also Read: ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలకలం.. హైదరాబాద్‌లో మత్తు దందా గుట్టురట్టు..!
అయితే, ఏం జరిగిందో తెలియదు కానీ మూడ్రోజుల క్రితం తల్లిగారింటికి వెళ్లిన భాగ్యలక్ష్మి బాత్రూంకు వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తాన చావుకు ఎవరూ కారణం కాదని.. ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదని.. అందుకే చనిపోతున్నా అంటూ చేతిపై రాసుకొని ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీంతో కుటుంబసభ్యులు భాగ్యలక్ష్మి మృతిపై కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read: వైద్యురాలి అత్యాచార ఘటన.. గ్యాంగ్‌రేప్ జరగలేదన్న సీబీఐ
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భాగ్యలక్ష్మి ఎందుకు చనిపోయింది. తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుందా? అత్తింటి వాళ్లు ఏమైనా టార్చర్ పెట్టారా? భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చి సూసైడ్ చేసుకుందా? అసలేం జరిగింది? చేతిపై భాగ్యలక్ష్మే రాసుకుందా? లేక ఎవరైనా రాశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
[vuukle]