తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా రెండు గ్యారంటీలను శనివారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రారంభించారు. మొదటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన 'మహాలక్ష్మి పథకం', 'ఆరోగ్య శ్రీ' పరిమితిని రూ. 10 లక్షలకు పెంచే మరో పథకాన్ని అధికారికంగా మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి సైతం బస్సు లో ప్రయాణించి ప్రయాణికులను అలరించారు.
ఈ సందర్భంగా స్కూల్ పిల్లలు, కాలేజీ అమ్మాయిలతో సరదాగా ముచ్చటించారు. సెల్ఫీలు దిగి అలరించారు. సిలిండర్ రూ.500 లకు ఇస్తాం. ఆర్ టీసీ జీతాలు కూడా పెరుగుతాయన్నారు. సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించామని చెప్పిన ఆయన.. తన చిన్ననాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. 7వ తరగతిలో ఉన్నప్పుడు తాను హైదరాబాదనుంచి నడుచుకుంటూ రుద్రారం వచ్చినట్లు గుర్తు చెప్పారు. 12 ఏళ్లకే హైదరాబాద్ నుంచి పొద్దున 10 గంటలకు బయలుదేరి కాలినడకన రుద్రారం దాకా వచ్చానని, అయితే ఊరు దగ్గరలోకి రాగానే రోడ్డు మీద రూపాయి చిక్క దొరికితే అది పట్టుకుని సంగారెడ్డి బస్ ఎక్కి ఇంటికి చెరినట్లు తెలిపారు. పైసలు ఎవరినీ అడగలేకపోయానని, అందుకే నడుచుకుంటూ వచ్చాన్నారు. ఇక మహిళలకు ఆర్టీసీ ఫ్రీ. మెట్రో కూడా తెస్తాం. ఓడిపోయిన మెట్రో తెప్పించే బాధ్యత నాది. కాంగ్రెస్ ఉన్నంత కాలం మీ పథకాలకు ఢోకా లేదన్న ఆయన జీవితంలో కాంగ్రెస్ పార్టీని మరిచిపోవద్దంటూ మహిళలకు సూచించారు.
Also read :మీ రిలేషన్ బోర్ కొడుతోందా.. మళ్లీ కొత్తగా ఆశ్వాదించాలంటే ఇలా చేయండి
ఇదిలావుంటే.. సంగారెడ్డి జిల్లా అధికారులకు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుకుం జారీ చేశారని తెలుస్తోంది.ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు తన సతీమణిని ఆహ్వానించాలని తెలిపారు. న సతీమణి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలన్న జగ్గారెడ్డి ప్రభుత్వ కార్యకలాపాలకు తప్పకుండా ఆమెను ఆహ్వానించాలని అధికారులకు సూచించారని తెలుస్తోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేశారు. జగ అంటే హుందా కలిగిన నేతనని, ఎప్పుడూ చిల్లర రాజకీయాలకు పాల్పడలేదని తెలిపారు. ఏ కార్యక్రమం అయినా తన భార్య నిర్మలకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నట్లు అందరూ జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు చెబుతున్నట్లు వెల్లడించారు. అలాగే కొన్ని కారణాల వల్ల పరాజయం పాలయ్యానని అన్నారు. సంగారెడ్డిలో రాజకీయ పరిస్థితులు తనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ హుందాగా వ్యవహరించానని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో తమ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉందని జగ్గారెడ్డి చెప్పారు. ఇకపై సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమానికి, ప్రతి ప్రారంభోత్సవానికి తన అర్ధాంగి నిర్మలను కూడా ఆహ్వానించాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు.