/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-04T154046.187.jpg)
YCP Chief Jagan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన జగన్ పార్టీ పునర్‌నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. రోజూ ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. 48మంది ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అవనున్నారు. ఎమ్మెల్సీలు చేజారి పోకుండా నిలుపుకునే వ్యూహం రచిస్తున్నారు. శాసనమండలిలో అత్యధికంగా వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రభుత్వ బిల్లుల విషయంలో వైసీపీ ఎమ్మెల్సీలు కీలకం కానున్నారు.