YCP Chief Jagan: తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చెప్పట్టింది. రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. జగన్ ను ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేలా చూడాలి అని కోర్టును కోరారు. ఈ క్రమంలో దీనికి కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. రూల్ పొజిషన్ వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
11 కు ప్రతిపక్ష హోదానా?
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. వైనాట్ 175 అని ఎన్నికల ప్రచారంలో జగన్ కు ఎన్నికల ఫలితాలు భారీ షాక్ ఇచ్చాయి. ఇది కేవలం జగన్ కే కాదు యావత్ దేశానికే ఊహించాని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అధికారంలో ఉన్న పార్టీ కోలుకోలేకుండా కేవలం 11 స్థానాలకు పరిమితం కావడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలి కావచ్చు. కాగా కేవలం 11 స్థానాలకు పరిమితం అయిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించలేదు స్పీకర్. దీంతో జగన్ కోర్టు మెట్లు ఎక్కాడు.. తనకు ప్రతిపక్ష కల్పించేలా చూడాలని కోర్టును కోరారు, దీనిపై విచారణ కొనసాగుతోంది. కాగా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.
Also Read : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే