AP Politics: టీడీపీ కార్యాలయాల వద్ద 'జగనాసుర వధ'.. పాల్గొన్న లోకేశ్, బ్రహ్మణి! టీడీపీ రాష్ట్ర నాయకులు నారా లోకేశ్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ కార్యాలయాల వద్ద 'జగనాసుర వధ' కార్యక్రమాన్ని నిర్వహించారు. 'సైకో పోవాలి' అని రాసి ఉన్న పత్రాలను దహనం చేశారు. అటు రాజమండ్రిలో జగనాసుర వధ కార్యక్రమంలో టీడీపీ నేత లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి పాల్గొన్నారు. By Trinath 23 Oct 2023 in తూర్పు గోదావరి టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల వద్ద 'జగనాసుర వధ' కార్యక్రమాన్ని నిర్వహించారు. అటు రాజమండ్రిలో జగనాసుర వధ కార్యక్రమంలో టీడీపీ నేత లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి పాల్గొన్నారు. 'సైకో పోవాలి' అని రాసి ఉన్న పత్రాలను లోకేశ్, బ్రాహ్మణి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు. సైకో పోవాలి బాబు రావాలి అంటూ నినాదాలు: అటు విశాఖలో కూడా టీడీపీ కార్యాలయం వద్ద జగనాసుర వధ పేరుతో వినూత్న నిరసనకు దిగారు. జగన్‌ను మహిషాసురిడితో పోలుస్తూ ముద్రించిన పోస్టర్లు దగ్ధం చేశారు. ఈ నిరసనలో మాజీ మంత్రి కొండ్రుమురళి, టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు. సైకో పోవాలి బాబు రావాలి అంటూ నినాదాలు చేశారు. వంగలపూడి అనిత కామెంట్స్ : • జగనాసురుడు పోవాలి అంటూ దసరాని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది • ఈ సీఎం ఒక సైకో.. • పుంగనూరులో జెండా పట్టుకున్నారని వారిపై దాడులు చేస్తారా..? • టైం మాకు వస్తుంది.. ఒకవైపే మీరు చూస్తున్నారు • పోలీసులు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇస్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. • బస్సు యాత్ర అంటూ ప్రచారం చేస్తున్నారు.. పరదాలు కట్టుకొనే జనంలోకి వెళ్లే నువ్వు బస్సు యాత్ర చేస్తావా..? • టిడిపి జనసేనను చూసి వైసీపీ భయపడుతుంది.. • రేపటి నుంచి ఇంకా ఉంటుంది... బూతులు తిట్టడానికి క్యూలో రెడీగా ఉంటారు వైసీపీ మంత్రులు. • వచ్చేది టీడీపీ ప్రభుత్వంమే.. • వచ్చే ఎన్నికలో డబ్బు ప్రభావం చాలా ఉంది.. • వైసీపీ వాళ్ళ దగ్గర మూటలు మూటలు డబ్బు ఉంది. • ఓటుకు 50 వేలు జగన్ ఇచ్చిన ప్రజలు ఓట్లు వేయరు.. Also Read: జేఏసీ సమావేశంలో 3 తీర్మానాలు.. కరువు-జగన్ కవలపిల్లలు! #nara-lokesh #nara-brahmani #ap-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి