/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/minister-roja-2-jpg.webp)
Minister Roja: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి రోజా. అనంతంర రోజా మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM Jagan) రెండోసారి సీఎం అవ్వడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. మహిళలు, వృద్ధులు రాత్రి వరకు క్యూలో నిలబడి ఓటు వేశారని పేర్కొన్నారు. 2014లో ఉన్న ఇదే ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. ఇప్పుడు ఆ కూటమికి ఎలాంటి క్రేజ్ లేదని అందరికీ తెలుసు అని చురకలు అంటించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను టీడీపీ అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని దొంగాటలు ఆడినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరని అన్నారు. చంద్రబాబును పుట్టించిన ఖర్జూర నాయుడు వచ్చినా ప్రజల మనస్సుల్లో నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చెరిపేయలేరు అని పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండోసారి సీఎం అవ్వడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లను టీడీపీ అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.… pic.twitter.com/L3kmCtXnEn
— RTV (@RTVnewsnetwork) June 2, 2024
Also Read: ప్రియురాలిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్.. ఫొటోలు వైరల్!