YCP : వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌ డేట్‌ ఫిక్స్ చేసిన అధిష్టానం... ఎప్పుడు.. ఎక్కడ నుంచి అంటే!

మార్చి 16 వ తేదీన వైసీపీ ఫైనల్ లిస్ట్‌ ను విడుదల చేసేందుకు జగన్‌ రెడీ అవుతున్నారు. శనివారం జగన్‌ ముందుగా ఇడుపాలపాయకు వెళ్లనున్నారు.అక్కడ వైఎస్సాఆర్‌ ఘాట్‌ వద్దనే వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌ ను జగన్‌ ప్రకటించనున్నారు.

New Update
AP : ఏపీలో ఫైనల్ ఫలితాలు..ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే!

Ap Politics : ఏపీ(AP) లో ఎన్నికలు(Elections)  సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్ని కూడా తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే జనసేన ఇప్పటికే తన రెండు జాబితాలను విడుదల చేసి 15 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ(YCP) తన తుది జాబితాని ప్రకటించేందుకు సిద్దం అయ్యింది.

వైసీపీ ముందు నుంచి కూడా ఏపీలో మరోసారి పగా వేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వై నాట్‌ 175 అంటూ వైసీపీ అధినేత జగన్‌(YS Jagan) ముందు నుంచి అంటున్నారు. ఆ దిశగానే పక్కా ప్రణాళికతో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆయన ముందుకు దూసుకుపోతున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరైతే గెలిచే అవకాశాలున్నాయో వారినే బరిలోకి దించుతున్నారు.

ఇప్పటికే 12 లిస్టులను వైసీపీ అధినేత ప్రకటించారు. ఈ క్రమంలోనే వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌(YCP Final List) ని విడుదల చేసేందుకు వైసీపీ అధినేత రెడీ అయ్యారు. దానికి ముహుర్తం కూడా ఖరారు అయ్యింది. మార్చి 16 వ తేదీన వైసీపీ ఫైనల్ లిస్ట్‌ ను విడుదల చేసేందుకు జగన్‌ రెడీ అవుతున్నారు. శనివారం జగన్‌ ముందుగా ఇడుపాలపాయకు వెళ్లనున్నారు.

అక్కడ వైఎస్సాఆర్‌ ఘాట్‌(YSR Ghat) వద్దనే వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో(Assembly - Parliament Elections) పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌ ను జగన్‌ ప్రకటించనున్నారు. ఇడుపాలపాయ నుంచే ఎందుకు అంటే జగన్ 2019 ఎన్నికల సమయంలో కూడా ఇడుపాయలపాయ వైఎస్సాఆర్ ఘాట్‌ నుంచే లిస్ట్ ని విడుదల చేశారు.

అదే సెంటిమెంట్ తో ఆయన మరోసారి అక్కడ నుంచి అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తుంది. ఈ సెంటిమెంట్‌ కానీ సక్సెస్ అయితే వైసీపీ మరోసారి ఏపీలో అధికార పీఠం ఎక్కడం ఖాయామనిపిస్తుంది. లిస్ట్‌ ప్రకటించిన తరువాత జగన్‌ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.

ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటించిన రెండు రోజులకే జగన్‌ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఒకరోజులు రెండు మూడు బహిరంగ సభలు ఉండేలా జగన్ తన ప్లాన్‌ ని సిద్దం చేసుకుంటున్నారు.

Also Read : YS Jagan: ఏపీ సీఎం పులివెందుల పర్యటన!

Advertisment
తాజా కథనాలు