Jagan to Attend For Second 'Siddham' Meeting: సీఎం జగన్(Jagan) ఇవాళ(ఫిబ్రవరి 3) ఏలూరు జిల్లా దెందులూరు(Denduluru)లో సిద్ధం బహిరంగ సభలో పాల్లొనున్నారు. ప్రజానీకం, పార్టీ శ్రేణులతో మమేకమవుతారు. భీమిలిలో జరిగిన మొదటి సిద్దం మీటింగ్ పెద్ద హిట్ అయింది. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు రెండో సిద్ధమ్ సమావేశాన్ని కూడా భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్త పీ.మిధున్‌రెడ్డి, మంత్రులు వేణుగోపాల కృష్ణ, జోగి రమేశ్, మాజీ మంత్రి ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తదితర నేతలు సభా వేదిక వద్దే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 150 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు ఐదు లక్షల మందిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.
8 జిల్లాల నేతలు, కార్యకర్తలతో జనసముహం:
భీమిలి సభకు పెద్ద ఎత్తున స్పందన రావడంతో ఉత్సాహంగా ఉన్న వైసీపీ నేతలు శనివారం దెందులూరు సభలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎనిమిది జిల్లాలు, 50 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటారు. భీమిలి 'సిద్ధం' సమావేశంలో సీఎం వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా సామాన్యులను అభివర్ణించారు. ఇక నిన్న (ఫిబవ్రరి 2) జగన్‌కి మద్దతుగా మహిళా స్టార్ క్యాంపెయినర్లు వినూత్న రీతిలో బల ప్రదర్శన చేశారు. గోదావరి నదికి సమీపంలో 'సిద్ధం' అని రాసి ఒక చెయిన్ లాగా ఫార్మ్ చేశారు. జగన్‌కి, ఏపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై పోరాడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. మరోవైపు సభా వేదికను కూడా విభిన్నంగా డిజైన్ చేశారు. వేదిక మధ్యలో పొడవైన ర్యాంప్‌ను ఏర్పాటు చేశారు.. ఇలా చేయడం వల్ల జగన్ అతి దగ్గరి నుంచి ప్రజలతో మాట్లాడవచ్చు.
ప్రగతి నివేదిక:
మరోవైపు గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పరంపరపై ప్రజలకు ఒక విధమైన ప్రగతి నివేదికను జగన్ విడుదల చేయనున్నారని సమాచారం. ముఖ్యంగా మహిళలు, బలహీనవర్గాల వారి జీవితాలను మార్చడంలో అది ఏ పథకం ఏ విధంగా దోహదపడిందో వివరిస్తారని తెలుస్తోంది.
Also Read: నిద్రలేచిన వెంటనే మొబైల్ చూస్తే ఏం అవుతుందో తెలుసుకుంటే మళ్లీ ఆ పని చేయరు!
WATCH: