Jagan Letter to Modi: ప్రధాని మోదీకి జగన్ సంచలన లేఖ.. తదుపరి చర్యలు నిలిపి వేయాలన్న సీఎం!

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. కృష్ణ ట్రైబ్యునల్ విషయంలో జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపి వేయాలని లేఖలో పేర్కొన్నారు జగన్. ప్రస్తుతం కృష్ణా జలాల పై కోర్టులో కేసులు పెండింగ్ ఉండడంతో తదుపరి చర్యలు నిలిపి వేయాలని జగన్ కోరారు.

New Update
Jagan Letter to Modi: ప్రధాని మోదీకి జగన్ సంచలన లేఖ.. తదుపరి చర్యలు నిలిపి  వేయాలన్న సీఎం!

ప్రధాని మోదీ(PM MODI)కి సీఎం జగన్(CM Jagan) లేఖ రాశారు. కృష్ణ ట్రైబ్యునల్(Krishna Tribunal) విషయంలో జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపి వేయాలని లేఖలో పేర్కొన్నారు జగన్. ప్రస్తుతం కృష్ణా జలాల పై కోర్టులో కేసులు పెండింగ్ ఉండడంతో తదుపరి చర్యలు నిలిపి వేయాలని జగన్ కోరారు.

కేంద్ర ఆమోదం తర్వాత జగన్‌ లేఖ:
తెలంగాణ కృష్ణా ట్రిబ్యునల్ అభ్యర్థనకు కేబినెట్ ఆమోదం తెలిపి రెండు రోజులు అవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (ఏపీ) రాష్ట్రాల మధ్య తీర్పు కోసం (ISRWD) చట్టంలోని సెక్షన్ 5(1) కింద ప్రస్తుత కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2కు అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) జారీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ (3) కింద తెలంగాణ ప్రభుత్వం (GOT) తమ ఫిర్యాదులో లేవనెత్తిన ఆందోళనలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ, నియంత్రణపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడం వల్ల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని కేంద్రం చెబుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తోంది.

కేంద్రం ఏం చేయబోతోంది?
ఇదే విషయాన్ని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా జలాలను ట్రైబ్యునల్ రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుందన్నారు. ఇక ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కావడంతో మోదీకి జగన్‌ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీతో జగన్‌ సర్కార్‌ సయోధ్యని కొనసాగిస్తుందని.. మిత్రపక్షంగా ఉండబోతుందన్న ప్రచారం సమయంలో జగన్‌ లేఖ రాయడం చర్చనీయాంశమవుతోంది. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్న జగన్‌ కేంద్ర పెద్దలను కలిశాడు. నిజానికి 1956 ISRWD చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఆయా రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం 2004లో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2ను ఏర్పాటు చేసింది. 2014లో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ, నియంత్రణపై తలెత్తిన వివాదాన్ని ప్రస్తావించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. దాన్ని జగన్‌ ఇప్పుడు అపోజ్ చేస్తున్నారు.

ALSO READ: హైదరాబాద్లో ఐటీ సోదాలకు కారణమేంటి? మాగంటికి సంబంధమేంటి?

CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL

Advertisment
Advertisment
తాజా కథనాలు