Jagan: వైసీపీ నేతలు జంప్!... మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు AP: నేతలు పార్టీ విడడంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాజీనామా చేయాలనుకున్నవారు చేసుకోవచ్చని చెప్పారు. నేను, అమ్మ ఇద్దరమే మొదలుపెట్టి ఇంత దూరం వచ్చినట్లు తెలిపారు. మళ్లీ మొదటి నుండి ప్రారంభించేందుకు సిద్ధమని అన్నారు. By V.J Reddy 04 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YCP Chief Jagan: వైసీపీ నేతల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడుతారనే ప్రచారంపై ఘాటుగా స్పందించారు. పార్టీని వీడే వాళ్లను ఉద్దేశించి జగన్ హాట్ కామెంట్స్ చేశారు. వెళ్లిపోయేవాళ్లను ఎన్నిరోజులు ఆపగలం అని అన్నారు. వెళ్లే వాళ్లకు విలువలు, నైతికత ఉండాలని చెప్పారు. బలంగా నిలబడే వాళ్లే నాతో ఉంటారని పేర్కొన్నారు. పార్టీ పరిస్థితిపై జగన్ భావోద్వేగం అయినట్లు తెలుస్తోంది. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లారని.. వాళ్లలో ఇపుడు ఎంతమంది అధికారంలో ఉన్నారని ప్రశ్నించారు. అటుఇటు పోయేవాళ్లు ఎటు కాకుండా పోతారని చురకలు అంటించారు. నేను, అమ్మ ఇద్దరమే మొదలుపెట్టి ఇంత దూరం వచ్చినట్లు చెప్పారు. మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం, ఇబ్బందేం లేదని ఖరాకండిగా జగన్ వైసీపీ నేతలతో చెప్పినట్లు సమాచారం. #jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి