/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-27T153928.465.jpg)
Mid Day Meal Scheme in AP: ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తిపి కబురు చెప్పింది. ఈ యేడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం మరింత నాణ్యతతో రుచికరంగా అందించబోతున్నట్లు తెలిపింది. ఇందుకోసం విజయవాడలోని తాజ్ హోటల్ లో పనిచేసే చెఫ్ లతో స్కూల్ లో వంటచేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నట్లు సమాచారం. పప్పు, పప్పుచారు, వెజ్ కర్రీస్, పులిహోర, పొంగల్ వంటి వంటివి మెనూలో తప్పకుండా ఉండాలని సూచించింది. అలాగే తిరుపతి తాజ్ హోటల్ చెఫ్ లతో మధ్యాహ్న భోజనం రుచికరంగా చేసేందుకు అవసరమయ్యే టిప్స్ తో వీడియోలను కూడా రూపొందించారు అధికారులు. రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలు ఎలా చేయాలో వివరించటంతో పాటు వాటి వల్ల కలిగే లాభాల గురించి కూడా చెఫ్‌లు వివరిస్తారు. పాఠశాల విద్యాశాఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఇందుకు సబంధించిన సమాచారం, వీడియోలను అప్లోడ్ చేశారు.