AP: అంగన్వాడీలకు షాక్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ

అంగన్వాడీలకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. వారిపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. విధులకు హాజరుకాకపోవడంతో వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది.

AP: అంగన్వాడీలకు షాక్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ
New Update

AP: ఏపీలో అంగన్వాడీలకు జగన్ (Jagan) సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పలు డిమాండ్లతో సమ్మె చేస్తున్న వారిపై ఎస్మా (Esma) చట్టం ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నం.2ను జారీ చేయడంతోపాటు.. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ మేరకు అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. సమ్మెలో ఉన్న కాలానికి సంబంధించి వేతనం కట్ చేసింది. ప్రతినెలకు ఇవ్వాల్సిన రూ. 10 వేల వేతనానికి గానూ  ప్రభుత్వం ఈ నెల రూ.8050 మాత్రమే జమ చేసింది.

ఇది కూడా చదవండి : Challenge: మంచు లక్ష్మీకి అదిరిపోయే సవాల్ విసిరిన మెగా హీరో.. షాక్ లో మోహన్ బాబు ఫ్యామిలీ

ఎస్మా అంటే..
ది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటనెన్స్ యాక్ట్ (The Essential Services Maintenance Act) కు సంక్షిప్త రూపమే ఎస్మా.. ప్రజల సాధారణ జీవనం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా ఈ చట్టం ఉపయోగపడుతుంది. వైద్యం, ప్రజా రవాణా వంటి అత్యవసర సేవలు అందించే రంగాలలోని సిబ్బంది సమ్మెల పేరుతో విధులకు గైర్హాజరు కాకుండా ప్రభుత్వం ఈ చట్టం ప్రయోగించవచ్చు.

లోకేష్ తీవ్ర విమర్శలు..
ఇక దీనిపై స్పందించిన టీడీపీ నాయకుడు లోకేష్.. అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఎం తెలుస్తుందంటూ జగన్ పై విమర్శలు చేశారు. 'అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఎం తెలుస్తుంది? పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా? అంగన్వాడీ ఉద్యమం పై సైకో సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణం. అంగన్వాడీల పై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం.. జగన్ నియంత పోకడలకు పరాకాష్ట. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జిఓ నెంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలి. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. జగన్ అహంకారానికి.. అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదే' అని ఆయన ట్వీట్ చేశారు.

#jagan #anganwadis #esma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe