/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Nara-Bhuvaneshwari-jpg.webp)
Bhuvaneshwari Reacts on Chandrababu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత తొలిసారి ఆయన భార్య భువనేశ్వరి మీడియా ముందుకు వచ్చారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు శుభనేశ్వరి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏపీ అభివృద్ధి కోసమే పని చేసేవారని, ప్రజల కోసమే ఆయన పోరాడారని భువనేశ్వరి చెప్పారు. ఏమీ లేని కేసులో చంద్రబాబును జైల్లో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితం అంతా ప్రజల కోసం దారపోసారని అన్నారు. తనకు ఎప్పుడూ ఫ్యామిలీ ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యం అనేవారని గుర్తు చేశారు భువనేశ్వరి. ప్రజలంతా బయటకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు భువనేశ్వరి. జైల్లో ఆయన్ను చూసి ఒక భాగం అక్కడ వదిలేసి వచ్చినట్లు ఉందన్నారు భువనేశ్వరి. తమ కుటుంబానికి ఇది చాలా టఫ్ టైమ్ అని ఉద్వేగానికి లోనయ్యారు శుభనేశ్వరి.
భావోద్వేగానికి గురైన భువనేశ్వరి..
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు భువనేశ్వరి. జైలుకెళ్లి చంద్రబాబును ఊస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందొద్దని చెప్పినట్లు తెలిపారు. అయితే, జైల్లో చంద్రబాబు భద్రత విషయమై ఆందోళన వ్యక్తం చేశారు భువనేశ్వరి. సరైన భద్రతా చర్యలు జైలులో కనిపించడం లేదన్నారు భువనేశ్వరి. చన్నీళ్లతో స్నానం చేస్తున్నారని వాపోయారు. 'ప్రజల కోసం పోరాడిన మనిషిని ఇలా చేస్తారా? మాతో పాటు ప్రజలు కూడా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన జైలు లోపల కూడా ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు.' అంటూ ఉద్వేగానికి లోనయ్యారు భువనేశ్వరి.
ఒక భాగం అక్కడే వదిలేసి వచ్చినట్లుంది..
చంద్రబాబుకు భద్రత లేదు..
ఇది టఫ్ టైమ్..
Also Read:
Telangana Elections: ప్లీజ్ అలా ప్రచారం చేయకండి.. ఆ ప్రకటనపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కేటీఆర్..
Big Breaking: చంద్రబాబుకు మరో షాక్.. హౌస్ రిమాండ్‌కు కోర్టు నో!