Ongole : అక్రమ సంబంధం మోజు.. ముగ్గురు పిల్లలను అనాధలను చేసిన ఇల్లాలు

అక్రమ సంబంధం మోజులో భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయిన ఇల్లాలు చివరికి ప్రియుడి చేతిలో హతమైన సంఘటన ఒంగోలు జిల్లాలో జరిగింది. గాజులపాలేనికి చెందిన కొండపల్లి గౌరి భర్త వెంకట్‌రెడ్డిని మోసం చేసి మహేష్‌ అనే యువకుడితో లేచిపోగా శనివారం శవమై కనిపించిచడం జిల్లాలో సంచలనం రేపింది.

New Update
Ongole : అక్రమ సంబంధం మోజు.. ముగ్గురు పిల్లలను అనాధలను చేసిన ఇల్లాలు

Illegal Affair : పిల్ల పాపలతో హాయిగా సాగిపోతున్న ఓ కుటుంబంలో యువకుడు చిచ్చు రేపాడు. పక్కింట్లో ఉంటున్న ఇల్లాలితో పరిచయం ఏర్పరుచుకుని మాయమాటలతో కొంతకాలానికి ఆమెను బుట్టలో వేసుకున్నాడు. భర్త లేనప్పుడు తనతో లైంగిక చర్యలకు పాల్పడుతూ చివరికి ఆమెను లేపుకుపోయాడు. యువకుని మోజులో పడి ముగ్గురు ఆడ పిల్లలను తండ్రి దగ్గర వదిలేసి వెళ్లిపోయిన ఆమె చివరికీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒంగోలు జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ మేరకు ఒంగోలు(Ongole) నగరంలోని రాజీవ్‌ గృహకల్ప కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి జరగగా.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పదిహేనేళ్ల క్రితం నంధ్యాల(Nandyala) జిల్లా గాజులపాలేనికి చెందిన కొండపల్లి గౌరి(Gauri) (32) కి అదే ప్రాంతంలోని వెంకట్‌రెడ్డి(Venkat Reddy) తో పెళ్లి జరిగిది. వీరికి ముగ్గురు కుమార్తెలు. అయితే నందిపల్లెకు చెందిన మహేష్‌(Mahesh) అనే యువకుడితో గౌరికి పరిచయం ఏర్పడింది. అతడికి కూడా వివాహమైంది. పిల్లలున్నారు. అయితే మహేష్‌తో గౌరీ అక్రమ సంబంధం(Illegal Affair) పెట్టుకుందని తెలిసి వెంకట్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గౌరి తన ఇద్దరు కుమార్తెలను స్వగ్రామంలోనే విడిచిపెట్టి పదేళ్ల చిన్న కుమార్తెతో కలిసి మహేష్‌ తో నంధ్యాల నుంచి పారిపోయి ఒంగోలులో స్థానిక రాజీవ్‌ గృహకల్ప కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.

ఇది కూడా చదవండి : Digital Payments : ఆన్ లైన్ పేమెంట్ యూజర్లకు అలర్ట్.. చేతిలో క్యాష్ లేకపోతే పండగపూట తెల్లమొహాలే

ఇక బేల్దారి పనులు చేస్తూ కుంటుంబాన్ని పోషిస్తున్న మహేష్ తో ఒ విషయంలో గౌరీ గొడవ పెట్టుకుంది. కొద్దిసేపటికి సద్దుమణిగినప్పటికీ శనివారం ఉదయం గౌరి ఇంట్లోనుంచి పాప ఏడుపు వినిపించగా స్థానికులు వెళ్లి చూసేసరికి గౌరి చనిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. అయితే మహేష్‌ ఆమెను హత్యచేసిన అనంతరం ఇంటికి తాళంవేసి వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్న స్థానికులు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్సై పున్నారావు అక్కడికి చేరుకుని పరిశీలించారు. గౌరి నిద్రించిన మంచం కింద తాడును స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు తరలించారు. ఇక పరారీలో ఉన్న నిందితుడ్ని త్వరలోనే అరెస్టు చేస్తామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు