16 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు.. రిఫండ్ రూ.500 కోట్లు

ఏపీ, తెలంగాణలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఆదాయపు పన్ను శాఖలో దాదాపు రూ.500 కోట్లకు పై మొత్తంలో రీఫండ్ కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు.. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ తనిఖీలతో పలువురి అధికారల్లో టెన్షన్‌ మొదలైంది.

16 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు.. రిఫండ్ రూ.500 కోట్లు
New Update

IT searches in 16 areas..Refund over 500 crores

ఆంధ్రపద్రశ్‌, తెలంగాణలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. ఆదాయపు పన్ను శాఖలో రూ.500 కోట్లకుపై మొత్తంలో రీఫండ్ కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు.. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఐటీశాఖ నుంచి పలువురు రీఫండ్ పొందినట్లుగా వెలుగులోకి తెచ్చారు ఐటీ అధికారులు. ఈ స్కామ్‌లో చార్టెడ్ అకౌంటెంట్లు కీలకంగా వ్యవహరించారని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు భారీగా లబ్ధి పొందినట్లు అనుమానిస్తున్నారు.

ట్యాక్స్ రీఫండ్ పేరుతో కోట్లలో స్వాహా..

అయితే ఇంకా వందల మందిని ఐటీ ఆఫీస్‌కి పిలిచి మరీ అధికారులు విచారించారు . హైదరాబాద్‌లో 8 ప్రాంతాలతోపాటు.. ఏపీలోని రాజమండ్రి, అమలాపురం, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో సోదాలు చేశారు. ట్యాక్స్ రీఫండ్ పేరుతో కోట్లలో స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను శాఖలో భారీగా నిధులు స్వాహా చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఐటీ అధికారులు. సోదాలు పూర్తయితే ఎక్కడెక్కడ.. ఎవరెవరు.. ఎంతెంత మేర కుంభకోణం చేశారో తెలియనుంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe