IT Rides: జొమాటో డెలివరీ బాయ్ 75 కోట్ల కొనుగోళ్లు.. ఎలా చేశాడు?

జొమాటో డెలివరీ బాయ్ పేరుపై.. అతని ఎకౌంట్ ఉపయోగించి 75 కోట్ల రూపాయల కొనుగోళ్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఐటీ శాఖ అధికారులు దీనిపై దర్యాప్తు చేయగా.. అమిత్ అగర్వాల్, జంషెడ్‌పూర్‌ సిండికేట్‌లు ఇలా చాలామంది ఎకౌంట్స్ నుంచి బోగస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్టు తేలింది. 

IT Rides: జొమాటో డెలివరీ బాయ్ 75 కోట్ల కొనుగోళ్లు.. ఎలా చేశాడు?
New Update

IT Rides: జొమాటోలో డెలివరీ బాయ్ కి ఎంత జీతం ఉంటుంది? ఒకవేళ అతనికి బోలెడు డబ్బు ఉండి హాబీగా ఈ పని చేస్తున్నాడు అనుకుందాం.. అప్పుడు ఎంత సంపాదన ఉండవచ్చు? సరే ఒక వ్యక్తి బాగా సంపాదించాడు అనుకుంటే.. ఎంత డబ్బును ఏవైనా కొనడం కోసం ఉపయోగిస్తాడు? ఇన్ని ప్రశ్నలు ఎందుకు వచ్చాయో తెలియాలంటే.. ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఆదాయపు పన్ను శాఖ అధికారులు అనుమానం వచ్చిన ప్రతి ఎకౌంట్ చెక్ చేస్తారు. ఇప్పుడు అంతా ఆన్ లైన్ వ్యవహారం. పాన్ కార్డు.. ఆధార్ కార్డు.. జీఎస్టీ లెక్కలు.. ఇలా అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఎక్కడన్నా ఎవరైనా ఒక వ్యక్తి పెద్ద స్థాయిలో కొనుగోళ్లు చేసినా.. అమ్మకాలు చేసినా.. అతని ఎకౌంట్ లోకి ఒక్కసారే పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడినా ఆదాయపు పన్ను శాఖకి తెలిసిపోతుంది. అది ఎలా ఏమిటి అన్నది వేరే విషయం. 

ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఒక జొమాటో డెలివరీ బాయ్ ఎకౌంట్ గురించి. ఆ డెలివరీ బాయ్ పేరుపై.. అతని పాన్ కార్డు ఉపయోగించి 75 కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిగినట్టు ఐటీ అధికారులకు(IT Rides) తెలిసింది. మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా.. అందుకే.. ఆ వ్యక్తిని (అప్పటికి జొమాటో బాయ్ అని వారికీ తెలీదు) పట్టుకోవడానికి వెళ్లారు. తీరా ఆ ఎడ్రస్ దగ్గరకు వెళ్లి వారు అవాక్కయ్యారు. బీహార్ లోని ధన్‌బాద్‌లోని సరైధేలాలోని ఆ ఎడ్రస్ వద్ద కనీసం ఇల్లు కూడా లేని డెలివరీ బాయ్ దగ్గరకు చేరుకున్నారు. అతని కోసం అక్కడి చెక్ పోస్ట్ దగ్గర వేచి చూడాల్సిన పరిస్థితి ఐటీ అధికారులది. ఇక అతన్ని పట్టుకున్నాకా.. అతని పరిస్థితి చూసి ఐటీ అధికారులకు మతి పోయింది. అతని తల్లి ఇళ్లలో పని చేసుకుని జీవిస్తోంది.  అది చూసిన తరువాత ఆ డెలివరీ బాయ్ ని వదిలేసి.. దీని తీగలగడం మొదలు పెట్టారు. 

ఆ తీగ వెళ్లి అమిత్ అగర్వాల్, జంషెడ్‌పూర్‌ సిండికేట్‌ల దగ్గరకు చేరింది. వీరు ఇలా డెలివరీ బాయ్స్, వివిధ కార్మిక ప్రజలకు చెందిన బ్యాంక్ ఎకౌంట్స్, పాన్ నంబర్స్ తో కోట్లాది రూపాయల బోగస్ సేల్ కొనుగోళ్లు చూపించినట్లు తేలింది. పలువురి పేరుపై 10-20 కోట్ల రూపాయల మేర ఈ బోగస్ సేల్ కొనుగోళ్లు జరుగుతున్నాయి. వీరి ఎడ్రస్ కూడా తప్పుగా ఉంది. 

ఇలా బొగ్గు, ఇనుము, స్క్రాప్‌తో పాటు పలు వస్తువులను బోగస్‌గా కొనుగోలు చేసినట్లు ఆధారాలు(IT Rides) లభ్యమయ్యాయి. చాలా మంది కార్మికుల పేర్లతో బోగస్ కొనుగోలు విక్రయాలు జరిగాయని, వారి చిరునామాలు కూడా తప్పుగా ఉన్నాయని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. రైడ్ బృందం ఇలాంటి మరికొన్ని ప్రాంతాలకు వెళ్లినా ఎవరికీ ఏమీ దొరకలేదు. ఈ గేమ్‌లో అమిత్ అగర్వాల్‌తో పాటు పెద్ద సిండికేట్ ప్రమేయం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ రాకెట్‌లో ధన్‌బాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డెలివరీ బాయ్స్ ఉన్న లొకేషన్లపై ఇన్‌కమ్ ట్యాక్స్ టీమ్ సోదాలు చేసినా ఏమీ దొరకలేదు. ఈ కేసుకు సంబంధించిన మరికొన్ని లింక్‌లపై టీమ్ ప్రస్తుతం కసరత్తు చేస్తోంది.

#business #it-rides
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe