IT Returns: ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియ కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైంది. జూలై 31 వరకు గడువు ఇచ్చారు. ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ITR ఫైల్ చేయడంలో వైఫల్యం సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి, మీరు పన్ను రిటర్నులు సకాలంలో ఫైల్ చేయడం చాలా ముఖ్యం. జూలై 31 చివరి తేదీ. ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించేందుకు సరిపడా ఆదాయం లేకపోవడంతో ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదన్న భావన చాలామందిలో ఉంటుంది. ఇది తప్పు. ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయకపోతే జరిగే పరిణామాల వివరాలు ఇవే…
జరిమానా వడ్డీ
సెక్షన్ 234A ప్రకారం నిర్ణీత వ్యవధిలోపు పన్ను చెల్లించకపోతే, మీకు చెల్లించాల్సిన పన్ను మొత్తంలో నెలవారీ 1 శాతం ఛార్జ్ చేస్తారు.
జరిమానా.. చెల్లించాలి
IT Returns: సెక్షన్ 234ఎఫ్ ప్రకారం, గడువు తేదీలోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే రూ. 5,000 జరిమానా విధిస్తారు. వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయల లోపు ఉంటే ఆలస్య రుసుము వెయ్యి రూపాయలు మాత్రమే. మీ ఆదాయం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే ఐటీఆర్ ఆలస్యంగా ఫైల్ చేసినందుకు ఎలాంటి జరిమానా ఉండదు.
నష్టాన్ని బదిలీ చేయడం సాధ్యం కాదు...
మీరు మీ ITRని ఆలస్యంగా ఫైల్ చేస్తే, షేర్ లావాదేవీల నుండి వచ్చే నష్టాలను, F&O ట్రేడింగ్ నుండి వచ్చే నష్టాలను మీరు ఫార్వార్డ్ చేయలేరు. అంటే ఈ నష్టాన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో జమ చేయలేము. అయితే, ఇంటి ఆస్తి అమ్మకంలో నష్టాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది.
టాక్స్ రీఫండ్స్ లో సమస్య...
మీరు అదనపు పన్ను చెల్లించినట్లయితే, మీరు ITR ఫైల్ చేసి వాపసు పొందవచ్చు. మీరు వడ్డీతో పాటు వాపసు పొందుతారు. ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేసినట్లయితే, తిరిగి చెల్లించాల్సిన పన్ను మొత్తానికి వడ్డీ జోడించడం జరగదు.
అసెస్మెంట్..
IT Returns: మీరు ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయనట్లయితే, పన్ను శాఖకు అందుబాటులో ఉన్న మీ సమాచారం ప్రకారం అసెస్‌మెంట్ చేస్తారు. అప్పుడు మీకు ఎక్కువ పన్ను భారం పడే అవకాశం ఉంది.
పాత పన్ను విధానం ఉండకపోవచ్చు..
మీరు ఇప్పటి వరకు పాత పన్ను విధానాన్ని ఎంచుకుని, ఈ సంవత్సరం ITR ఫైల్ చేయకుంటే, మీరు కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ అయిపోతారు. తదుపరిసారి మీరు ITR ఫైల్ చేయడానికి వెళ్లినప్పుడు మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకోలేరు.