IT raids: పాతబస్తీలో ఐటీ రైడ్స్: బడా వ్యాపారులే టార్గెట్‌

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఐటీ రెయిడ్స్ జరగడం కలకలం రేపుతోంది. శనివారం పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్‎గా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

IT raids: పాతబస్తీలో ఐటీ రైడ్స్: బడా వ్యాపారులే టార్గెట్‌
New Update

IT Raids: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఐటీ రెయిడ్స్ జరగడం కలకలం రేపుతోంది. శనివారం పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్‎గా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కింగ్స్ ప్యాలెస్ గ్రూప్స్ యజమాని నివాసంతో పాటు పాతబస్తీలోని పలువురు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఉదయమే ఈ తనిఖీలు ప్రారంభమయ్యాయి.

ఇది కూడా చదవండి: రక్తాలు కారేలా తన్నుకున్న బీఆర్ఎస్ నేతలు..కేటీఆర్ రోడ్ షోలో ఘటన..!

వీరంతా కొహినూర్, కింగ్స్ గ్రూప్స్ పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‎గా మారింది. శాస్త్రి పురం , మలక్ పేటలో ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు.

తాండూరులోని దుర్గ హోటల్‎లో బస చేసిన కింగ్స్ గ్రూప్ యజమానిని ఆ హోటల్ లోనే ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకూ రెండు గంటల పాటు చేసిన సోదాల్లో పలు కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

#telangana-elections-2023 #it-raids
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe