IT raids: పాతబస్తీలో ఐటీ రైడ్స్: బడా వ్యాపారులే టార్గెట్ తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఐటీ రెయిడ్స్ జరగడం కలకలం రేపుతోంది. శనివారం పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. By Naren Kumar 26 Nov 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి IT Raids: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఐటీ రెయిడ్స్ జరగడం కలకలం రేపుతోంది. శనివారం పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కింగ్స్ ప్యాలెస్ గ్రూప్స్ యజమాని నివాసంతో పాటు పాతబస్తీలోని పలువురు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఉదయమే ఈ తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఇది కూడా చదవండి: రక్తాలు కారేలా తన్నుకున్న బీఆర్ఎస్ నేతలు..కేటీఆర్ రోడ్ షోలో ఘటన..! వీరంతా కొహినూర్, కింగ్స్ గ్రూప్స్ పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శాస్త్రి పురం , మలక్ పేటలో ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. తాండూరులోని దుర్గ హోటల్లో బస చేసిన కింగ్స్ గ్రూప్ యజమానిని ఆ హోటల్ లోనే ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకూ రెండు గంటల పాటు చేసిన సోదాల్లో పలు కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. #telangana-elections-2023 #it-raids మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి