IT Raids: తమిళనాడు పీడబ్ల్యూడీ మినిస్టర్ ఇంట్లో ఐటీ దాడులు!

IT Raids: తమిళనాడు పీడబ్ల్యూడీ మినిస్టర్ ఇంట్లో ఐటీ దాడులు!
New Update

దేశ వ్యాప్తంగా ఐటీ అధికారులు (IT Officers)  స్పీడు పెంచారు. మంత్రుల ఇళ్లను టార్గెట్‌ చేసి ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా ఐటీ అధికారులు దాడులు చేయడం అధికార, ప్రతిపక్ష పార్టీల వారిని కలవర పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడు పీడబ్ల్యూడీ మినిస్టర్‌ ఈవీ వేలు పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

తమిళనాడు (Tamilanadu) వ్యాప్తంగా ఏక సమయంలో 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పీడబ్ల్యూడీ టెండర్లు, కాంట్రాక్టు వ్యవహారాల్లో ఆయనకు సంబంధం ఉన్నట్లు అనుమానాల నేపథ్యంలో ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read: ఏ పార్టీకి ఎన్ని విరాళాలొచ్చాయో చెప్పండి.. ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం

హైదరాబాద్‌ నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌ నేతల ఇళ్లనే టార్గెట్‌ చేసుకోని శుక్రవారం కూడా ఐటీ సోదాలు చేస్తున్నారు. మొత్తం 18 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి (Janareddy) నివాసంలో ఐటీ అధికారులు ఉదయం నుంచే సోదాలు చేపట్టారు. జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి వ్యాపార లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు దృష్టి పెట్టారు.

గురువారం నాడు హైదరాబాద్‌ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కాంగ్రెస్ నాయకురాలు చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. వీరి ఇళ్లలో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. కోకాపేటలో గిరిధిర్ రెడ్డికి సంబంధించిన ఈడెన్‌ గార్డెన్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Also read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే నామినేషన్లు

తుక్కుగూడలోని కేఎల్ఆర్ పార్టీ కార్యాలయంలోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంకు అధికారుల సమక్షంలో ఈ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇక పార్టీ కార్యాలయ వద్ద సీఆర్‌పీఎఫ్ బలగాలు భారీగా మోహరించాయి. పార్టీ కార్యాలయంలో నగదుతో పాటు కీలక డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమారం అందుతోంది. శంషాబాద్ కేఎల్ఆర్ ఫామౌజ్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. KLR ఫామౌజ్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఐటీ సోదాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ఆర్ ప్రస్తుతం మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఉదయం నుంచి కేఎల్‌ఆర్‌, అయన బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 6 గంటలుగా కొనసాగుతున్న ఈ సోదాలను సీఆర్పీఎఫ్ బలగాల రక్షణలో, బ్యాంక్ అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఇక ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

#tamilanadu #elections #it #raids
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe