హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో రెండు రోజుల క్రితం మొదలైన ఐటీ తనిఖీలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. వైష్ణవి గ్రూప్ స్థిరాస్తి సంస్థ, హోటల్ అట్ హోమ్ సంస్థలు వాటి అనుబంధ సంస్థల్లో అధికారుల తనిఖీలు చేస్తున్నారు
వీటితో పాటు ఆయా సంస్థల కార్యాలయాల్లో మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లలో ఐటీ తనీఖీలు నిర్వహిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి ,శేఖర్ రెడ్డి ఇళ్లల్లో సైతం వదలకుండా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాలల్లో 70 మంది ఐటీ అధికారుల బృందాలు పాల్గొనట్లు సమాచారం.
రియల్ ఎస్టేట్, మైనింగ్ సహా ఇతర వ్యాపారాలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి కలసి చేసినట్లు ఐటీ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో హిల్‌ల్యాండ్, మైన్స్‌ల్యాండ్, తీర్థ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, శ్రీలార్వెన్ సిండికేట్ సంస్థల్లో ఈ ముగ్గురికీ చెందిన కుటుంబ సభ్యులే భాగస్వాములుగా ఉండటంతో ఇందుకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు.
హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు రూపంలో జరిగిన లావాదేవీలపైనా ఐటీ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించి తెరవగా కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలు బయటపడ్డట్లు ఐటీ అధికారులు తెలిపారు.