Telangana Elections: కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు..

ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులపై ఫోకస్ పెంచింది ఐటీ. తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జి. వివేక్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆయన ఇల్లు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.

New Update
Telangana Elections: కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు..

IT Raids in Vivek House: మంచిర్యాల జిల్లాలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. వివేక్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కంపెనీలు, ముఖ్య అనుచరులు, బంధువుల ఇళ్లలో కూడా ఐటి దాడులు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్, చెన్నూరులో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వివేక్ ఇంటితో పాటు.. ఆయన సోదరుడు, కూతురు ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివేక్ కంపెనీకి చెందిన వ్యక్తులు కొందరు ఇటీవలే రూ. 50 లక్షలతో పట్టుబడ్డారు. ఆ తరువాత విశాఖ ఇండస్ట్రీస్‌కు చెందిన రూ. 8 కోట్లను ఫ్రీజ్ చేశారు. విశాఖ ఇండస్ట్రీస్ అకౌంట్ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్‌ ఖాతాలోకి ఆ మనీని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ నెల 13వ తేదీన నగదు బదిలీ అయినట్లు గుర్తించారు అధికారులు.

కాగా, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌కు చెందిన కంపెనీ నుంచి భారీ మొత్తంలో సొమ్ము బదిలీ కావడంతో ఎన్నికల కమిషన్ ఫోకస్ పెట్టింది. రూ. 8 కోట్ల నగదు బదిలీపై విశాఖ ఇండస్ట్రీస్ సిబ్బందిని వివరణ కోరింది ఈసీ. ఈసీ ఆదేశాల మేరకు రూ.8కోట్లను ఫ్రీజ్‌ చేశారు బ్యాంక్‌ అధికారులు. మరోవైపు నగదు లావాదేవీలపై సైఫాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఐటీ రైడ్స్ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. వివేక్ ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. టార్గెట్ చేసి మరీ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.

Also Read:

నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే..

ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు