MP Student Gets Rs 46 Crore Tax Notice: ఓ కాలేజీ విద్యార్థికి జీఎస్టీ అధికారుల నుంచి రూ. 46 కోట్ల కు పన్ను కట్టాలంటూ నోటీసులిచ్చారు. అంతే దెబ్బకి హడలిపోయిన ఆ విద్యార్థి శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు.అసలేం జరిగిందంటే... మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన ప్రమోద్ కుమార్ (Pramod Kumar) దండోటియా కాలేజీలో చదువుతున్నాడు. అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ. 46 కోట్ల లావాదేవీలు జరిగాయని.. అందుకు గానూ అతడు పన్ను చెల్లించాలనేది ఆ నోటీసుల ముఖ్యాంశం.
Also Read: పీవీకి భారత్ రత్న… అందుకున్నది ఎవరో తెలుసా
దీంతో బెంబెలెత్తిపోయిన ఆ విద్యార్థి సంబంధిత అధికారులను సంప్రదించగా తన పాన్ కార్డు పై ఓ కంపెనీ రిజిస్టార్ అయినట్లు వారు గుర్తించారు. ముంబైతో (Mumbai) పాటు ఢిల్లీ (Delhi) ప్రాంతాల్లో మూడు సంవత్సరాల క్రితం ఆ విద్యార్థి పాన్ కార్డ్ నెంబర్ (Pan Card) తో ఎవరో ఓ కంపెనీ ప్రారంభించి అతని బ్యాంక్ అకౌంట్ నుంచి కోట్లలో లావాదేవీలు జరిపారని విద్యార్థి తెలుసుకున్నాడు. దీంతో అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని , అసలు ఆ కంపెనీ ఏంటో కూడా తనకు తెలియదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
విద్యార్థి పాన్ కార్డును గుర్తు తెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి కంపెనీ ని రిజిస్టర్ చేసి... ఆ తర్వాత ఆ అకౌంట్ నుంచి కోట్లలో లావాదేవీలు జరిపారని దీని గురించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.