హైదరాబాద్‌లో ముగిసిన ఐటీ తనిఖీలు

కొండని తవ్వి ఎలకను పట్టినట్లుగా ఐటీ రైడ్స్ ఉన్నాయని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై బురదజల్లే ప్రయత్నం తప్ప నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు.. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వెల్లడించిన ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి.

New Update
హైదరాబాద్‌లో ముగిసిన ఐటీ తనిఖీలు

publive-image

నివాసాలు, వ్యాపారాల నుంచి కీలక సమాచారం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. గత 3 రోజుల క్రితం ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్‌రెడ్డి, పైల శేఖర్‌రెడ్డి, ఎంపీ కోట ప్రభాకర్‌రెడ్డి నివాసాలు, వ్యాపార సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యాపారాలు నిర్వహిస్తున్న నేతలే టార్గెట్‌గా తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లలో ఐటీ శాఖ ఏకకాలంలో సోదాలు చేయడంతో బీఆర్‌ఎస్‌ నేతల్లో టెన్షన్‌ మొదలైంది. సోదాల్లో నేతల నివాసాలు, వ్యాపారాల నుంచి అధికారులు పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం.

నాపై బురదజల్లే ప్రయత్నం..

కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ తన నివాసంలో పార్టీ కార్యకర్తలతో యదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడి కంచర్ల రామాకృష్ణారెడ్డితో పైళ్ల శేఖర్‌రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ నా నివాసంలో గంటన్నర పాటు సోదాలు జరిగాయని తెలిపారు. కావాలనే 3 రోజుల పాటు ఐటీ అధికారులు కాలయాపన చేశారని ఆయన మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది ఐటీ అధికారుల తీరు అన్నారు. ఇంకా ఏమన్నా దొరుకుతుందా అన్న దానిపై తనిఖీలు జరిగాయని తెలిపారు. కావాలనే నాపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఐటీ తనిఖీలు వెనుక ఏ పార్టీ హస్త ఉందో అందరికి తెలుసని మండిపడ్డారు. నాకు ఈనెల 22న గురువారం రమ్మని ఐటీ అధికారులు నోటీసులు అందజేశారని తెలిపారు. నేను నిజాయితీగా ఉన్నారని, నా నియోజకవర్గం ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు.

కుట్ర పూరితంగానే ఐటీ రైడ్స్..

ఐటీ తనిఖీలు తరువాత నాకు ఎలాంటి కాల్స్ రాలేదని అన్నారు. గత 3 రోజులుగా నాపై కుట్ర పూరితంగానే ఐటీ రైడ్స్ జరిగాయని అన్నారు. నాపై జరుగుతున్న పలు ఆరోపణలు నిజం కాదని తెలిపారు. ఐటీ రైడ్స్ మొదటి రోజే ఒక గంటన్నర లోనే పూర్తి అయ్యాయని, కావాలనే 3 రోజులు కాలయాపన చేశారని మండిపడ్డారు. విదేశాలలో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి అన్నది అవాస్తవం మని తెలిపారు. 1998 నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని అన్నారు. నాకు ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవని, ఐటీ అధికారులకు వారికి అనుకూలమైన సమాచారం రాకపోవడంతో నిరుత్సాహంతో వెనుతిరిగారని అన్నారు. నాకోసం 3 రోజులుగా ఇక్కడే వున్న కార్యకర్తలకు, నాయకులకు అందరికి ధన్యవాదాలు ఆయన తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు