Wayanad: ప్రకృతి ప్రకోపానికి ముందు...తర్వాత..ఇస్రో వాయనాడ్ శాటిలైట్ పిక్స్ ప్రకృతి అందాలకు నెలవైన వయనాడ్ ప్రాంతం ప్రస్తుతం మృతుల దిబ్బను తలపిస్తోంది. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ప్రదేశాలన్నీ మట్టిదిబ్బలుగా మారాయి. దీనికి సంబంధించిన ఉపగ్రహ ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. By Manogna alamuru 02 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ISRO Satellite Photos: భారీ వర్షం కారణంగా వాయనాడ్‌లో మంగళవారం మూడు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. ప్రజలు చాలా మంది బురద కింద సమాధి అయ్యారు. ఈ ప్రకృతి విపత్తులో 293 మంది చనిపోయారు. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ రెస్కూ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. ఇప్పటి వరకు 1000 మందిని రక్షించింది. రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరో 240 మంది ఇప్పటికీ కనిపించడం లేదు. కొండచరియలు విరిగి పడిన కారణంగా చాలా మంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. చాలా ఇళ్ళు నేల మట్టం అయ్యాయి. మట్టి, రాళ్ళతో భూమంతా కప్పబడిపోయింది. వాటి మధ్య ఏడుపులు, రోదనలతో ప్రజలు తమ వారి కోసం వెతుకులాడుతూ తిరుగుతున్నారు. ఈ దృశ్యాలతో అక్కడి వాతావరణం భయానకంగా, హృదయవిదారకంగా తయారయింది. ఇస్రోతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా శాటిలైట్ చిత్రాలు ఈ విపత్తు ఏ మేరకు ఉందనే విషయాన్ని అంచనా వేశాయి. ఇస్రోకు చెందిన కార్టోశాట్-3, ఆర్‌ఐఎస్‌ఏటీ అత్యాధునిక ఉపగ్రహాలను నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తీసిన 3డీ ఫోటోలను విడుదల చేసింది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం 13 కంటే ఎక్కువ ఫుట్‌బాల్ మైదానాలతో సమానంగా ఉందని అంచనా వేసింది. ఈ ఘటనలో దాదాపు 86వేల చ.మీటర్ల భూభాగం జారిపడిపోయినట్లు ఇస్రో అంచనా వేసింది. సముద్రమట్టానికి 1550 మీటర్ల ఎత్తులో ఈ కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని గుర్తించింది. ఇరువంజిపుళ నదిలో దాదాపు 8కి.మీ మేర ఈ శిథిలాలు కొట్టుకుపోతున్నట్లు సమాచారం. Also Read:Andhra Pradesh: మిమ్మల్ని మన్నించండి కామ్రేడ్స్– మంత్రి లోకేశ్ #wayanad #satellite-pics #isro మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి