ISRO Recruitment 2023: ఇస్రోలో జాబ్ అంటే ఆ లెవల్ వేరు. అందుకు ఉండే పోటీ కూడా ఎక్కువే. ఇటివలి ఇస్రో నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇస్రో టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్‌మన్ బి స్థానాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆగస్టు 21 వరకు గడువు ఉంది.
ఖాళీ
➼ ఖాళీలు:
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 34 ఖాళీలు టెక్నీషియన్ B, ఒకటి డ్రాఫ్ట్స్‌మన్ Bకి ఉంది.
➼ వయో పరిమితి:
• ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 18 నుంచి 35 ఏళ్ల వయస్సులోపు ఉండాలి.
➼ అర్హత:
దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి.. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ ఉండాలి.
➼ ఎంపిక ప్రక్రియ:
ఈ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష. 90 నిమిషాల పాటు జరిగే రాత పరీక్షలో 80 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి ఒక మార్కు ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.33 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రాత పరీక్ష తర్వాత, అభ్యర్థులు 1:5 నిష్పత్తిలో నైపుణ్య పరీక్షకు ఎంపిక అవుతారు.
➼ దరఖాస్తు రుసుము: రూ. 500
➼ జీతం:
టెక్నీషియన్-B కోసం వేతనం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఉంటుంది. అదేవిధంగా. డ్రాఫ్ట్స్‌మన్-బి జీతం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఉంటుంది. రేడియోగ్రాఫర్-A విషయానికొస్తే వీరికి రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు శాలరీ ఉంటుంది.
➼ ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ- ఆగస్టు 2
దరఖాస్తుకు చివరి తేదీ - ఆగస్టు 21
➼ ఎలా దరఖాస్తు చేయాలి - How To Apply ISRO Recruitment 2023?
• అధికారిక వెబ్‌సైట్ www.isro.gov.in ని సందర్శించండి
• “ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి” లింక్‌ని గుర్తించి, క్లిక్ చేయండి.
• పోర్టల్‌లో నమోదు చేసుకోండి.
• లాగిన్ చేయండి.
• మీ వివరాలతో ఫారమ్‌ను ఫిల్ చేయండి.
• చెల్లింపు చేయండి.
• చివరగా, డాక్యుమెంట్ ప్రింటవుట్ తీసుకోండి.
Also Read: సెంట్రల్ రైల్వేలో 1,303 జాబ్స్‌కి నోటిఫికేషన్.. డీటైల్స్ చెక్ చేసుకోండి!