ISRO: AI, మెషిన్ లెర్నింగ్‌పై ఉచిత ఆన్‌లైన్ కోర్సు..

ఇస్రో 5 రోజుల ఉచిత ఆన్‌లైన్ కోర్సును ఆఫర్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మెషిన్ లెర్నింగ్(ML)కి సంబంధించిన అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు బోధించడానికి ఆగస్టు 19 నుండి 23 వరకు ఆన్‌లైన్ కోర్సు లైవ్‌లో ఉంటుంది.

ISRO: AI, మెషిన్ లెర్నింగ్‌పై ఉచిత ఆన్‌లైన్ కోర్సు..
New Update

ISRO Free Online Course: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) మరియు మెషిన్ లెర్నింగ్ (Machine Learning) ఇప్పుడు ప్రతి రంగంలో వినియోగిస్తున్నాయి. ఈ జ్ఞానాన్ని అందరికి చేరవేయాలనే ఉద్దేశంతో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) 5 రోజుల ఉచిత ఆన్‌లైన్ కోర్సును అందిస్తోంది. ఆగస్టు 19 నుంచి 23 వరకు లైవ్‌లో ఉండనున్న ఈ కోర్సు AI, ML పై అవసరమైన నైపుణ్యాలను నేర్పుతుంది.

ఇది IIRS అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ లో భాగం, అందుకే మీకు ఎలాంటి ఖర్చు ఉండదు.

IIRS అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ 2007లో ప్రారంభమైంది, ఇప్పటివరకు 3500 కంటే ఎక్కువ నెట్‌వర్క్ ఇన్‌స్టిట్యూట్‌లకు చేరుకుంది. ఇది యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాలు, పరిశోధనా సంస్థలకు ఉపకారపడింది.

Also Read: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు

ఈ కొత్త కోర్సు నిపుణులు, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. పరిశోధకులు కూడా దీన్ని నేర్చుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజినీరింగ్ వంటి రంగాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

5 రోజుల కోర్సు AI/ML తేలికపాటి పరిచయంతో మొదలవుతుంది. మెషిన్ లెర్నింగ్ పద్ధతులు, డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్‌లు, గూగుల్ ఎర్త్ ఇంజిన్ ద్వారా మెషిన్ లెర్నింగ్, పైథాన్ లో మెషిన్ లెర్నింగ్ వంటి విషయాలను కవర్ చేస్తుంది.

ISRO యొక్క AI, ML కోర్సు ఆగస్టు 19 నుంచి 23 వరకు నిర్వహిస్తారు. ఇందులో ఉపన్యాసాలు, వీడియో లెక్చర్లు వంటివి ఉంటాయి.

ఈ కోర్సు ఆన్‌లైన్‌లో ఉంటుంది, IIRS-ISRO E-క్లాస్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటుంది. దీన్ని యూజ్ చేయడానికి మంచి ఇంటర్నెట్ కనెక్షన్, ప్రాథమిక కంప్యూటర్ హార్డ్‌వేర్ అవసరం.

#artificial-intelligence #machine-learning #isro
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe