Isreal: జోరున యుద్ధం జరుగుతుంటే.. హోరుగా మందు తాగేస్తున్న ఇజ్రాయేల్  ప్రజలు.. 

ఒక పక్క యుద్ధం జరుగుతుంటే, ఇజ్రాయేల్ ప్రజలు మద్యం ఎక్కువగా వినియోగిస్తున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. మద్యంతో పాటు కుకీలు, స్నాక్స్ వంటి చిరుతిళ్ల అమ్మకాలు విపరీతంగా పెరిగినట్టు వెల్లడైంది. ఒక్క వైన్ అమ్మకాలే 100 శాతం పెరిగాయని చెబుతున్నారు

Isreal: జోరున యుద్ధం జరుగుతుంటే.. హోరుగా మందు తాగేస్తున్న ఇజ్రాయేల్  ప్రజలు.. 
New Update

Isreal: ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పడిగాడట ఒకడు.. కాస్త ముతక సామెతే.. కానీ, ఇజ్రాయేల్ ప్రజలకు ఇది సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది. ఒక పక్క యుద్ధం.. వేలాది మంది చనిపోతున్నారు.. వందలాది ఇళ్లు నేల కూలిపోతున్నాయి.. లక్షలాది మంది అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు. చిన్నారుల శ్మశానంలా గాజా సిటీ ఉందని ఐక్యరాజ్యసమితి చేసిన ప్రకటన ప్రపంచం మొత్తాన్ని అయ్యో అని బాధపడేలా చేసింది. కానీ, ఇజ్రాయేలు ప్రజల్లో చాలామంది  ఇవేమీ పట్టించుకోవడం లేదట. హాయిగా మందేసి.. కావాల్సిన బేకరీ ఫుడ్ తినేసి కాలక్షేపం చేసేస్తున్నారట. ఆ వివరాలు చూస్తే ఔరా అంటారు. 

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో, ఇజ్రాయెల్ నుంచి  షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అక్కడ మద్యం, బీర్, వైన్ వంటి ఆల్కహాలిక్ వస్తువుల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. అంతేకాదు..  కుకీల అమ్మకాలు 50% పెరిగాయి. బేకరీ ఉత్పత్తుల విక్రయం కూడా 33% పెరిగింది. డిమాండ్ - విక్రయాలకు సంబంధించిన ఈ డేటాను 'జెరూసలేం పోస్ట్' ప్రచురించింది. ఈ వార్తాపత్రిక ఇజ్రాయెల్ ప్రసిద్ధ ఫుడ్ డెలివరీ కంపెనీ యాంగో డెలి నుంచి ఈ డేటాను తీసుకున్నట్టు పేర్కొంది. 

అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేశారు. ఇందులో 1200 మంది చనిపోయారు. 240 మంది బందీలుగా ఉన్నారు. ఇజ్రాయెల్(Isreal) దాడుల్లో 13 వేలకు పైగా ప్రజలు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

వైన్ విక్రయాలు రెట్టింపు.. 

  • ఈ రిపోర్ట్ ప్రకారం, వైన్ డిమాండ్ చాలా పెరిగింది.  దీని కారణంగా అమ్మకాలు రెండింతలు పెరిగాయి. వైన్ అమ్మకాలు 100% పెరిగాయని చెబుతున్నారు. మరోవైపు బీర్ల అమ్మకాలు 40% పెరిగాయి. మద్యంతో పాటు బేకరీ వస్తువులు, చిరుతిళ్ల విక్రయాలు కూడా బాగా పెరిగాయి. కుక్కీల ఉత్పత్తుల అమ్మకాలలో 50% పెరుగుదల ఉంది. ఇది కాకుండా, బేకరీ వస్తువుల అమ్మకాలు 33% పెరిగాయి. 
  • ఇవన్నీ కాకుండా మరికొన్ని ఉత్పత్తుల విక్రయాలు కూడా పెరిగాయి. నివేదిక ప్రకారం, సోడా - ఎనర్జీ డ్రింక్స్ కు డిమాండ్ పెరిగింది. బాంబా, పొటాటో చిప్స్, దోసకాయ మిక్స్ వంటి ప్రసిద్ధ స్నాక్స్ అమ్మకాలు పది శాతానికి పైగా పెరిగాయి. వీటితో పాటు  సాధారణంగా ఉపయోగించే గృహోపకరణాలైన పాలు, గుడ్లు, చీజ్, చాక్లెట్ మిల్క్ - పేపర్ టవల్స్ వంటి వాటికి కూడా డిమాండ్ పెరిగింది. అక్టోబర్ 7న యుద్ధం మొదలైన వెంటనే వాటర్ బాటిళ్ల విక్రయాల్లో 1500% పెరుగుదల నమోదైంది. అయితే, యుద్ధం కొనసాగడంతో, దాని డిమాండ్ తగ్గింది.

Also Read: పార్లమెంట్‌ లో బాంబు పేల్చిన ప్రతిపక్షం…ఎక్కడంటే!

భారత్ సహాయం.. 

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య, భారతదేశం పాలస్తీనియన్లకు మానవతా సహాయం కోసం C-17 విమానం ద్వారా 32 టన్నుల నిత్యావసర వస్తువులను ఈజిప్టుకు పంపింది. బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్(Isreal), అమెరికా, హమాస్ మధ్య త్వరలో ఒప్పందం జరగబోతోందని అమెరికా మీడియా వాషింగ్టన్ పోస్ట్ తన నివేదికలో పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఖతార్ ద్వారా చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం, బందీల విడుదలకు బదులుగా 5 రోజుల కాల్పుల విరమణ ఉంటుంది. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి తెలిపారు.

మరోవైపు నవంబర్ 18 న 10 వేల మంది ఉత్తర గాజా నుంచి బయలుదేరినట్లు ఐక్యరాజ్యసమితి చెప్పింది. వీరిలో చాలా మంది పిల్లలు ఒంటరిగా వెళ్లిపోవడం కనిపించినట్లు వెల్లడించింది. 

Watch this interesting Video:

#isreal-vs-palestinia #isreal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe