Hamas Horrors: 40 మంది చిన్నపిల్లల తలలను నరికేశారు... ఇది యుద్ధం కాదు మారణహోమం...!

ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న పోరులో అమాయకులు తనువు చాలిస్తున్నారు. 40మంది శిశువులను హమాస్‌ తీవ్రవాదులు చంపేసినట్టు ఇజ్రాయెల్‌ మీడియా రిపోర్ట్ చేసింది. వారిలో చాలామంది శిశువుల తలలు నరికేసి ఉన్నాయి. అభంశుభం తెలియని చిన్నారులను ఇంత కిరాతకంగా చంపడం నిజంగా బాధాకరం. కిబ్బత్జ్ క్ఫర్ అజా అనే ప్రాంతంలో జరిగిందీ ఘటన.

Hamas Horrors: 40 మంది చిన్నపిల్లల తలలను నరికేశారు... ఇది యుద్ధం కాదు మారణహోమం...!
New Update

యుద్ధం అంటే వినాశనమే.. యుద్ధం అంటే విధ్వంసమే.. యుద్ధం అంటే విషాదమే..! రెండు స్వార్థ ముఠాల మధ్య, స్వార్థ గ్రూపుల మధ్య, స్వార్థ దేశాల మధ్య సామాన్యులు నలిగిపోయే రాక్షస క్రీడ యుద్ధం. ఇజ్రాయెల్‌(israel)-పాలస్తీనా(palestine) యుద్ధం అభంశుభం తెలియని చిన్నారులను పొట్టనపెట్టుకుంటోంది. అమాయకులు, లోకాన్ని ఇంకా చూడని వారు, పసిపిల్లలు, చిన్నారులు, విద్యార్థులు, ఆడవాళ్లు ఇలా ప్రతి ఒక్కరూ బాంబు దాడులకు బలైపోతున్నారు. ఏ నిమిషం ఎటు వైపు నుంచి ఎవరూ వస్తారో తెలియదు.. ఏ బాంబు మీద పడుతుందో అర్థంకాదు.. ఇల్లు దాటి బయటకు వెళ్తే తిరిగి వస్తామో లేదో గ్యారెంటీ లేదు. హమాస్‌ తీవ్రవాదులు, ఇజ్రాయెల్‌ దళాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఏ మాత్రం సంబంధంలేని వారు చనిపోవడం అత్యంత విషాదకరం. సోషల్‌మీడియా ఓపెన్ చేసి చూడాలంటే సామాన్యులకు భయం వేస్తున్న పరిస్థితి దాపరించింది. ఏ వీడియోలో ఏ చిన్నారి చనిపోయిందో తెలియదు.. ఏ విద్యార్థి కిడ్నాప్‌కు గురయ్యాడో అర్థంకాదు.. తాజాగా యుద్ధంలో జరిగిన దారుణానికి సంబంధించిన ఓ వార్త కన్నీరు పెట్టిస్తోంది. జరుగుతున్న యుద్ధంలో 40మంది చిన్నారులు అత్యంత క్రూరంగా హత్యకు గురయ్యారు.



దారుణం..మారణహోమం:

ఈ మధ్య కాలంలో చూడని నేరాలు, ఘోరాలను ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం చూపిస్తోంది. దాదాపు 40 మంది శిశువులతో సహా డజన్ల కొద్దీ బాధితుల మృతదేహాలను గుర్తించింది ఇజ్రాయెల్‌ సైన్యం. వీరిలో చాలా మంది శిశువుల తలలు నరికేసి ఉన్నాయి. హమాస్‌ తీవ్రవాదులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఇజ్రాయెల్‌ మీడియాతో పాటు అక్కడి సైనికులు చెబుతున్నారు. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారని సంబంధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకులు ఇలా బలైపోతాయని కలలో కూడా అనుకోలేదని కన్నీరుమున్నీరవుతున్నారు. కిబ్బత్జ్ క్ఫర్ అజా(Kibbutz Kfar Aza) అనే ప్రాంతంలో జరిగిందీ ఘటన. హమాస్(Hamas) తీవ్రవాదులు చేసిన క్రూరత్వాన్ని ప్రపంచం మొత్తం చూడాలని ఇజ్రాయెల్‌ మీడియా రిపోర్ట్ చేసింది.



ఇంకెన్ని ఘోరాలు చూడాలో:

ఈ దారుణం జరిగిన చోటుకు ఇజ్రాయెల్‌ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాను కూడా అక్కడి అధికారులు అనుమతించారు. మీడియా ప్రతినిధులు ఘోరం జరిగిన ప్రాంతానికి వెళ్లి చూసేసరికి అక్కడి నేలపై మృతదేహాలు పడి ఉన్నాయి. మృతదేహాల నుంచి కుళ్లిపోయిన వాసన వస్తోంది. ఇది చూసి అక్కడివారు కంటతడి పెట్టారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలే ఉండడం నిజంగా బాధాకరం. హత్య జరిగిన ఇళ్ల నుంచి బాధితుల మృతదేహాలను అక్కడి అధికారులు తొలగిస్తున్నారు. మొదటిసారిగా ఇజ్రాయెల్ సైన్యం మీడియా ఛానెళ్లను ఊచకోత కోసిన కమ్యూనిటీలలోకి అనుమతించింది. వీరంతా నిన్నటిమొన్నటి వరకు ఆడుతూ పాడుతూ గడిపిన వారు. తమ చావు ఈ విధంగా అన్యాయంగా వస్తుందని ఊహించలేకపోయిన పసి మనసులు వారివి. యుద్ధం నిజస్వరూపం ఇదే. అమాయకులను బలి తిసుకోవడమే యుద్ధం లక్షణం. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధం నిరూపిస్తోంది.

ALSO READ: మూడు మతాల యుద్ధభూమి.. ఎడతెగని యుద్ధానికీ కారణం అదేనా?

#hamas-vs-israel #israel-vs-palestina
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe