అదో అందమైర ప్రాంతం.. అక్కడ సూర్యోదయం చూడటానికి రెండు కళ్లు చాలవు. ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి మాటలు సరిపోవు. ముఖ్యంగా చిన్నపిల్లలకు స్వర్గధామం.. చిన్నారులు ఎక్కువగా ఆడి, పాడే ప్రాంతం అది. వారి జీవిత లక్ష్యాలు పురుడుపుసుకునే ఎన్నో స్కూల్స్ అక్కడే ఉన్నాయి. ఎంతో ఆనందంగా తోటి విద్యార్థులతో కలిసి మెలిసి జీవిస్తున్న వారి హృదయాల్లోకి తుపాకీ తూటాలు చొచ్చుకు వచ్చాయి. అప్పటివరకు ఎంతో భద్రంగా ఉన్న తమ నివాసాలపైకి బాంబులు దూసుకొచ్చాయి. రెప్పపాటు వ్యవధిలో ప్రాణాలు పోయాయి. హమాస్ మిలిటెంట్ల దారుణాలకు ఇజ్రాయెల్ నగరమైన కిబ్బట్జ్ బీరీ(kibbutz Beri)లోని పరిస్థితులు హృదయవిదారకంగా మారిపోయాయి.
శవాల కుప్పలు:
బీరీ చాలా అందంగా ఉండే ప్రాంతం. పొలాలు పచ్చగా మనసుకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. వెకేషన్ స్పాట్స్ నుంచి మీకు కావలసినవన్నిటిని ఈ నగరం మీకు చూపిస్తుంది. గాజా స్ట్రిప్‌కి అతి దగ్గరలో ఉండే నగరం. అందుకే హమాస్ తన రాకెట్‌లను ఎక్కువగా బీరీపై గురిపెట్టింది. శనివారం తెల్లవారుజామున.. హమాస్ మిలిటెంట్లు బీరీపై దాడి చేసి అనూహ్యమైన స్థాయిలో విధ్వంసం సృష్టించారు. అనేకమంది ప్రాణాలను బలిగొన్నారు. పిల్లలతో సహా 120 మంది నివాసితులను హత్య చేశారు. చాలా మందిని కిడ్నాప్ చేశారు. ఇళ్లకు నిప్పు పెట్టారు. అక్కడ వేడి, పొగ నుంచి తప్పించుకోలేక ఊపిరి ఆడాక చాలా మంది ప్రాణాలు విడిచారు. మిలిటెంట్లు ఇళ్లలోకి చోరబడి అందినకాడికి దొచుకున్నారు. కావాల్సినవి తీసుకున్న తర్వాత ఇళ్లను ధ్వంసం చేశారు.
సైరన్లతో నిద్రలేచారు:
నైట్ కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్న బీరీ వాసులు ఉదయం సైరన్ల సౌండ్‌తో లేచారు. పర్పూల్ సైరన్లు కూడా మోగించారు. ఇదంతా వార్నింగ్ అలెర్ట్. ఏం జరుగుతుందో అక్కడివారికి అర్థంకాలేదు. ఆ కమ్యూనిటీలో 11వందల మంది ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో వారు ఎవరికి అర్థంకాలేదు. ఇంతలోనే బాంబులు పేలుతున్న భారీ శబ్దాలు వినిపించాయి. ఒకేసారి మూడు భారీ సౌండ్లు రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. తెరుకునేలోపే వరుసపెట్టి బాంబు శబ్దాలు వినిపించాయి. అవి కాస్త తమ ఇంటిపై పడుతాయని ఊహించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మిలిటెంట్ల ఘోరాలు ఇక్కడితో ఆగలేదు. కొందరి ఇళ్లలోకి చోరబడి వారిని ఎత్తుకెళ్లిపోయారు. ఆ ఇళ్లకు నిప్పు పెడుతూ పైశాచిక ఆనందం పొందారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. ఇజ్రాయెల్‌లో వికెండ్ విహారయాత్రకు ప్రసిద్ధి చెందిన బీరీ నగరంలో ఇప్పుడు శవాలు ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో దర్శనమిస్తున్నాయి. మొదటి నాలుగు రోజులు సైనిక అధికారులు మీడియాకు బీరీలోకి అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం రిపోర్ట్ చేయడానికి బీరీకి చెరుకుంటున్న మీడియి ప్రతినిధులు అక్కడి దృశ్యాలను చూసి కన్నీరు కార్చుతున్నారంటే మిలిటెంట్ల విధ్వంసం ఏ స్థాయిలో జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు.
ALSO READ: యుద్ధంలో తెగిపడుతున్న తలలు.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియోలు..!