Israel Hamas War: యుద్ధంలో తెగిపడుతున్న తలలు.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియోలు..!

ఇజ్రాయెల్‌-పాలస్తీనాకు యుద్ధానికి చెందిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్ సైనికులు, అటు హమాస్‌ మిలిటెంట్ల మధ్య సామాన్యులు బలైపోతున్నారు. ఇక సోషల్‌మీడియాలో యూజర్లు రెండు వర్గాలుగా చీలిపోయి పోస్టులు పెట్టుకుంటున్నారు. ద్వేషాన్ని పెంచేలాగా ఆ పోస్టులు ఉంటున్నాయి.

Israel Hamas War: యుద్ధంలో తెగిపడుతున్న తలలు.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియోలు..!
New Update

Israel Hamas War: యుద్ధభూమి మరుభూమిగా మారడం మునపెన్నుడూ చూడని విషయం. చరిత్రలో ఏ యుద్ధం చూసినా బలైపోయింది అమాయకులే. వేల సంవత్సరాల నుంచి యుద్ధంలో జరుగుతున్న ఘటనలు చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. అప్పుడెప్పుడో జరిగిన వార్‌లు గురించి ఎందుకు.. మొన్న మొదలైన యుక్రెయిన్‌-రష్యా యుద్ధమైనా నిన్న మొదలైన ఇజ్రాయెల్‌(Israel)-పాలస్తీనా(Palestine) వార్‌ అయినా జరుగుతున్నది అదే కదా.. సామాన్యుల నెత్తుర కళ్ల చూసేది యుద్ధమే. హమాస్‌(Hamas) మిలిటెంట్ల దాడి తర్వాత ఎదురు దాడికి దిగిన ఇజ్రాయెల్‌ గాజాపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో మిలిటెంట్లతో పాటు సామాన్యులు సైతం తనువు చాలిస్తున్నారు. ఈ మరణాలు అటు పాలస్తీనా, ఇటు ఇజ్రాయెల్‌లోని సామాన్యులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నరక వేధనను మిగిలిస్తున్నాయి.

publive-image

రెండు గ్రూపులుగా:
ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధానికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తుపాకీలు పేలుతున్న వీడియోలు, బాంబుల వర్షం కురుస్తున్న దృశ్యాలు, విగతజీవులుగా మారి ఉన్న తమ కుటుంసభ్యుల ముందు కూర్చొని ఏడుస్తున్న బాధితుల వేధనలకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఫేక్‌ కూడా ఉంటున్నాయి. గుంపులో గోవిందాలాగా పాత వీడియోలను కూడా కొంతమంది షేర్ చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌-పాలస్తీనాకు (Israel Palestine) సంబంధించిన వీడియోలు షేర్ చేసేవారిలో ఇండియన్ యూజర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. రెండు వర్గాలుగా విడిపోయి కొంతమంది ఇజ్రాయెల్‌, మరికొంతమంది పాలస్తీనాకు సపోర్ట్ చేస్తున్నారు. అటు రైట్ వింగ్‌ మద్దతుదారులు ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గా పోస్టులు పెడుతూ కొన్నిసార్లు వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. అందులో ఒక వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

తమ కుటుంబసభ్యుల ముందు ఓ మహిళ ఏడుస్తున్న వీడియో అది. అక్కడి దృశ్యాలను నిశితంగా గమనిస్తే అది పాలస్తీనా గడ్డకు చెందిన వీడియోగా తెలుస్తోంది. ఓ ముస్లిం మహిళ ఏడుస్తున్న వీడియో అది. ఆమె పక్కన కూడా కొన్ని డెడ్‌బాడీలు కనిపిస్తున్నాయి. అక్కడి వారు కూడా ఏడుస్తున్నారు. ఇజ్రాయెల్‌ సైనికుల దాడిలో చనిపోయిన వారుగా అర్థమవుతుంది. అయితే ఇందులో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ వీడియో షేర్ చేసిన అతను ఆమెను 'డ్రామా క్వీన్‌' అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఆమె ప్రాపగండా మనకు తెలుసు కాబట్టి సరిపోయిందంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు. అతను ఇజ్రాయెల్ మద్దతుదారుడిగా క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వీడియో నిజమో కాదో ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

ALSO READ: వార్ కేబినెట్ అంటే ఏమిటి ? ఇది ఎందుకు అవసరం? హమాస్‎కు మూడినట్లేనా?

#israel-vs-hamas #israel-hamas-war
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe