Israel Vs Hamas: ప్రతీ 15 నిమిషాలకు ఒక చిన్నారి మృతి.. 5వేల మంది అమాయకులను బలితీసుకున్న యుద్ధం!

యుద్ధంలో బలైపోయేది అమాయకులే. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 5 వేలు దాటింది. మరణాలలో 62 శాతానికి పైగా మహిళలు, పిల్లలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు హమాస్‌ మిలిటెంట్లు రసాయన ఆయుధాలు వినియోగిస్తున్నారని అనుమానిస్తున్నాయి ఇజ్రాయెల్‌ నిఘా సంస్థలు.

New Update
Israel Vs Hamas: ప్రతీ 15 నిమిషాలకు ఒక చిన్నారి మృతి.. 5వేల మంది అమాయకులను బలితీసుకున్న యుద్ధం!

ఇజ్రాయెల్‌(Israel)-హమాస్‌(Hamas) యుద్ధంలో అమాయకులు బలైపోతున్నారు. డెత్‌ టాల్‌ 5 వేలు దాటినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హమాస్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేస్తుండడంతో ఒక్క గాజానేలో మరణించిన వారి సంఖ్య 5,087కి చేరుకుంది. ఇందులో సగం కంటే ఎక్కువ మంది చిన్నారురు, మహిళలే ఉండడం బాధాకరం. మరణాలలో 62 శాతానికి పైగా మహిళలు, పిల్లలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు యుద్ధంలో 15,273 మందికి పైగా గాయపడ్డారు. వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. నీరు, ఆహారం సరఫరాలు లేకపోవడంతో ఆకలి కేకలు పెరిగిపోయాయి. ఆకలితో అలమటిస్తూ చిన్నారులు నరకయాతన అనుభవిస్తున్నారు. గాజాలో కనీసం 212 మంది ఇజ్రాయెలీ, విదేశీ పౌరులు బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.

ప్రతి 15నిమిషాలకు ఒక చిన్నారి మృతి:
అటు ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు వివిధ ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయి. గాజా, వెస్ట్ బ్యాంక్ తో పాటు.. పొరుగుదేశం సిరియాపైనా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటిదాకా గాజా, లెబనాన్ కే పరిమితమైన ఈ దాడులు విస్తరిస్తుండడంతో.. యుద్ధంలోకి ఇతర దేశాలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఇక ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధంలో పెద్దసంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు సగం మంది 18 ఏళ్లలోపువారే ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో.. గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒక చిన్నారి బలైపోతున్నారని...అంతేకాకుండా నిత్యం 100 మందికిపైగా చనిపోతున్నారని పాలస్తీనియన్‌ స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.

రసాయన యుద్ధం?
గాజాతో పోలిస్తే ఇజ్రాయెల్‌లో ప్రాణనష్టం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 1,400 మంది మృతిచెందగా, వీరిలో 14 మంది పిల్లలు ఉన్నట్లు ప్రభుత్వం చెప్తోంది. దీంతో, ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం పిల్లల పాలిట శాపంగా మారిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే హమాస్‌ మిలిటెంట్లు రసాయన ఆయుధాలు వినియోగిస్తున్నారని అనుమానిస్తున్నాయి ఇజ్రాయెల్‌ నిఘా సంస్థలు. ఉగ్ర సంస్థ అల్‌ఖైదా నుంచి రసాయన ఆయుధాలను పొందినట్టు ఆరోపిస్తున్నాయి. ఈ విషయాన్ని అమెరికా సహా అన్ని దేశాల ఎంబసీలకు వర్తమానం పంపింది ఇజ్రాయెల్‌. పౌరులపై రసాయన ఆయుధాలను ప్రయోగించాలన్నది హమాస్ వ్యూహంగా కనిపిస్తోందని చెప్తోంది.

Also Read:యుద్ధం తీవ్రతరమైతే అది మీ దాకా వస్తుంది.. ఆ దేశానికి అమెరికా హెచ్చరికలు

Advertisment
తాజా కథనాలు