Israel Palestine Conflict: ఒళ్లు గగుర్పొడిచేలా వార్‌ వీడియోలు..భయంకర దాడులు.. 298 మంది మృతి..!

ఇజ్రాయేల్‌-పాలస్తీనా మధ్య జరుగుతున్న పోరు భీకర స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు ఇరు వైపుల ఉంచి 298 మంది మరణించినట్టు సమాచారం. 20 నిమిషాల్లో దాదాపు 5వేల రాకెట్లతో దాడి చేసిన హమాస్‌ మరోసారి 150 రాకెట్లతో విరుచుకుపడడంతో ఇజ్రాయేల్‌ దెబ్బకు దెబ్బ కొట్టాలని కాపు కాచుకోని కూర్చోంది. హమాస్‌ చీఫ్‌ ఇంటిపై ఇజ్రాయేల్ దాడి చేసినట్టు సమాచారం.

New Update
Israel-Hamas Attack:ఇజ్రాయెల్ దాడుల్లో బందీలు చాలామంది చనిపోయారు-హమాస్

బాంబుల మోత.. అడుగుతీసి అడుగు బయటకు వెయ్యలేని పరిస్థితి.. ఏ వైపు నుంచి ఏ ముప్పు తన్నుకోస్తుందో తెలియని దుస్థితి.. నిన్నమొన్నటివరకు యుద్ధంపై భయాలు ఇలానే ఉన్నా అవి వాస్తవరూపం దాల్చుతాయని అక్కడి ప్రజలకు తెలియదు పాపం. ఇజ్రాయేల్‌-పాలస్తీనా(Israel Palestine) యుద్ధం భీకర స్థితికి చేరుకుంది. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇరు వైపుల నుంచి ఇప్పటివరకు 298మంది మరణించినట్టు సమాచారం. తాజాగా ఇజ్రాయేల్‌పై హమాస్‌ 150రాకెట్లతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని హమాసే గర్వంగా చెప్పుకుంది. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ కూడా తాజా దాడిని రిపోర్ట్ చేసింది. ఇజ్రాయెల్‌పై సంవత్సరాలలో హమస్‌ చేసిన అతిపెద్ద దాడి ఇదే!

ఐక్యరాజ్యసమితి అలెర్ట్:
జరుగుతున్న దాడులను నిశితంగా గమనిస్తున్న UN రేపు మీటింగ్‌ పెట్టేందుకు సిద్ధమైంది. పాలస్తీనా సమస్యతో సహా మధ్యప్రాచ్యంలో పరిస్థితిపై యూఎన్ఎస్సీ(UNSC) ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు క్లోజ్డ్ మీటింగ్ నిర్వహించనుంది. మరోవైపు హమాస్‌ గుప్పిట్లో బందీలుగా ఉన్న ఇజ్రాయేల్‌ సైనికుల గురించి ఇప్పటివరకు స్పష్టమైన క్లారిటీ లేదు. వారిని ఇంకా బందీలుగానే ఉంచారా లేదా ఏదైనా చేశారా అన్నది తెలియాల్సి ఉంది. గాజా స్ట్రిప్‌లో డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ సైనికులను బందీలుగా ఉంచినట్లు హమాస్ మిలిటెంట్ గ్రూప్ తెలిపింది. 20 నిమిషాల్లో దాదాపు 5వేల రాకెట్లతో దాడి చేసిన హమాస్‌ మరోసారి 150 రాకెట్లతో విరుచుకుపడడంతో ఇజ్రాయేల్‌ దెబ్బకు దెబ్బ కొట్టాలని కాపు కాచుకోని చూస్తోంది.

ఇలా ప్రవేశించారు:
హమాస్‌ యోధులు ఫెన్సింగ్‌లు దాటుకోని మరి ఇజ్రాయేల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సరిహద్దు ఫెన్సింగ్‌లను హమాస్‌ యోధులు సులువుగా బద్దలు కొట్టి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించినట్టుగా వీడియోలు చూస్తే తెలుస్తుంది. అయితే ఆ సమయంలో ఇజ్రాయేల్ సైన్యం ఏం చేస్తోందని పలువురు మాజీ సైనికాధికారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎవరైనా ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశంలోకి ఎలా ప్రవేశించగలరని నిలదీస్తున్నారు. అయితే ఇదంతా ఇజ్రాయేల్‌ అంతర్గత కొట్లాట ప్రశ్నలు.. హమాస్‌ మాత్రం తగ్గేదే లేదంటోంది. ఇజ్రాయేల్ సైనికుల అంతుచూస్తానంటోంది. అటు బాంబుల దాడికి శిధిలాలు పడిపోయినట్లు స్థానిక మీడియా(NEXTA) ట్వీట్ చేసింది.

ఇజ్రాయేల్ ప్రతిఘటన:
ఒకరిని చంపితే మేం ఇద్దరిని చంపుతామని ఇజ్రాయేల్‌ రివర్స్ అటాక్ చేస్తోంది. హమాస్ గాజా చీఫ్ ఇంటిపై ఇజ్రాయెల్ విమానాలు దాడి చేశాయి. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసి 100 మందిని చంపినట్టు ప్రకటించుకున్న కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరిగింది. అయితే గాజా చీఫ్ ఇంటిపై దాడిలో ప్రాణనష్టం గురించి ఎలాంటి స్పష్టతా లేదు.

ALSO READ: గాజా స్ట్రిప్‌లో 240మంది మృతి.. భీకర రూపం దాల్చుతున్న యుద్ధం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు