Israel-Iran War: ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య ముదిరిన యుద్ధం

ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య యుద్ధం ముదిరింది. ఉదయం నుంచి హిజ్బుల్లాపై క్షిపణులతో ఇజ్రాయెల్ ఎటాక్ చేస్తోంది. హిజ్బుల్లా కూడా కౌంటర్ అటాక్‌కు దిగింది. వార్ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో విమాన సేవలు నిలిపివేశారు.

Israel-Iran War: ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య ముదిరిన యుద్ధం
New Update

Israel-Iran War: ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య యుద్ధం మరింత ముదిరింది. ఇరాన్‌ మద్దతు గల హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. వందలాది క్షిపణులతో ఇజ్రాయెల్ ఎటాక్ చేస్తోంది. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్న హిజ్బుల్లా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌పై రాకెట్‌, డ్రోన్లతో హిజ్బుల్లా దాడికి దిగింది. పరస్పర దాడులతో ఆకాశంలో భయంకర దృశ్యాలు కనిపిసితున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడికి హిజ్బుల్లా ముందే ప్లాన్ చేసింది.

హిజ్బుల్లా దాడి ప్లాన్‌ను పసిగట్టిన ఇజ్రాయెల్.. ఊహించనిరీతిలో ఉదయం నుంచే హిజ్బుల్లాపై క్షిపణులతో ఎటాక్ చేస్తోంది. హిజ్బుల్లా ఆయుధ కేంద్రాలను టార్గెట్‌గా ఇజ్రాయెల్ చేసుకుంది. తర్వాత దాడులను ప్రారంభించింది హిజ్బుల్లా. ఉత్తర ఇజ్రాయెల్‌లో 150 రాకెట్లను హిజ్బుల్లా పేల్చింది. వార్ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో విమాన సేవలు నిలిపివేశారు. దాడులను స్వీయ రక్షణ చర్యలుగా ఇజ్రాయెల్ అభివర్ణిస్తోంది.

Also Read : మీ ఆధార్ కార్డు మిస్ యూజ్ అవుతోందని డౌటా? ఇంటి నుంచే తెలుసుకోండిలా!

#israel-iran-war
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe