Israel: యుద్ధం సృష్టించే విషాదం అంటే ఇదే.. రఫాపై ఫొకస్ పెట్టిన ఇజ్రాయెల్‌..!

ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆరు నెలల యుద్ధకాండలో 33 వేల మందికి పైగా మరణించారు. లక్షల మంది గాయపడ్డారు. మిగిలిన ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇంతలో, ఇజ్రాయెల్ దక్షిణ గాజా భూమిపై పోరాడుతున్న తన సైనికులందరినీ ఉపసంహరించుకుంది. నగరం మొత్తం నాశనమైంది.

New Update
Israel: యుద్ధం సృష్టించే విషాదం అంటే ఇదే.. రఫాపై ఫొకస్ పెట్టిన ఇజ్రాయెల్‌..!

Israel: అప్పుడప్పుడూ ఉనికికో, స్వార్ధానికో ఉన్నపళంగా యుద్ధాలు ఊడి పడతాయి. యుద్ధమంటే వినాశనం మాత్రమే కాదు.. కొందరి మీద కురిసే కాసుల వర్షం కూడానూ. ఒకప్పటి యుద్ధ కథల్లో వీరులూ, మూష్కరులూ ఉంటారు. రాజులూ, సైనికులూ ఉంటారు. ఇప్పటి యుద్ధ కథల్లో చచ్చిపోయిన మనుషులూ, ఆకలితో అలమటించే పిల్లలూ ఉంటారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా శవాల కుప్పలా మారిన గాజాను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది.

ఎక్కడ చూసినా విధ్వంసం..

ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆరు నెలల యుద్ధకాండలో 33 వేల మందికి పైగా మరణించారు. లక్షల మంది తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇంతలో, ఇజ్రాయెల్ దక్షిణ గాజా భూమిపై పోరాడుతున్న తన సైనికులందరినీ ఉపసంహరించుకుంది. ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ తర్వాత విడువలవుతున్న దృశ్యాలు చూస్తుంటే యుద్ధం సృష్టించే విషాదం ఎలా ఉంటో అర్థమవుతోంది. నగరం మొత్తం నాశనమైంది. ఎక్కడ చూసినా విధ్వంసం జరిగిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read: ఈ వ్యాయామంతో కంటి సమస్యలు తగ్గుతాయి: యోగా మాస్టర్ గౌతం

శిథిలావస్థకు..

గాజా నగరం ఖాన్ యూనిస్ ఇజ్రాయెల్ దాడి కారణంగా శిథిలావస్థకు చేరుకుంది. ఇళ్లు నేలమట్టమైనట్లు కనిపిస్తున్నాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, స్టేడియంలు ఇలా అన్ని జాడలు అదృశ్యమయ్యాయి. అక్కడక్కడ మృతదేహాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. రోడ్లు, వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ బాంబు దాడి కారణంగా ఖాన్ యూనిస్ నగరం రూపురేఖలు మారిపోయాయి.

రఫాపై ఫొకస్

ఇజ్రాయెల్ దక్షిణ గాజా భూభాగంలో పోరాడుతున్న తన దళాలన్నింటినీ ఉపసంహరించుకుంది. గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో తమ మిషన్‌ను పూర్తి చేసినట్లు IDF తెలిపింది. ఇజ్రాయెల్‌ ఇప్పుడు తన దృష్టిని రఫాపై కేంద్రీకరిస్తోంది. ఈజిప్ట్, గాజా సరిహద్దులో ఉన్న రఫా, ఇజ్రాయెల్ దళాలు ఇంకా చేరుకోని ఏకైక ప్రాంతం. IDF రాఫాలో గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహిస్తే, పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్ల మరణాలు సంభవిస్తాయి. ఎందుకంటే 13లక్షలకు పైగా ప్రజలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. గతేడాది అక్టోబర్ 7న గాజాను పాలిస్తున్న హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసి 1200 మంది పౌరులను హతమార్చింది. దీనితో పాటు, 250 మందికి పైగా ఇజ్రాయెల్ , విదేశీయులు బందీలుగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ తన సైనిక చర్యను ప్రారంభించింది.

Advertisment
తాజా కథనాలు