/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/22-jpg.webp)
Israel Attacks: ఇజ్రాయెల్‌లో అతి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే అక్కడ పరిస్ధితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్ధమవుతోంది. ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఓ కుటుంబాన్ని వారింట్లోనే బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు వారి 18 ఏళ్ల కుమార్తెను కిరాతకంగా చంపేశారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు మిగతా నలుగురు ప్రాణాలు అరచేత పెట్టుకుని నేలపై కూర్చున్నారు.
🛑 STOP EVERYTHING. WATCH THIS PLEASE.
Israeli family is held hostage by Hamas terrorists who took control of their house inside Israel. Just look at their faces. This is a crime against humanity.
I demand world leaders to take action. #Israel #IsraelUnderAttack… pic.twitter.com/vKuN1vcqD0
— Hananya Naftali (@HananyaNaftali) October 8, 2023
ఇజ్రాయెల్ దేశంపై దండెత్తిన హమాస్ (Hamas) ఉగ్రవాదులు అతి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. సైనికులను, ప్రజలను బందీలుగా పట్టుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వీధుల్లో తుపాకులతో హల్‌చల్ చేస్తూ కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి చంపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణ ఇజ్రాయెల్‌లో జరిగినట్టు తెలుస్తోంది.
ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఓ కుటుంబాన్ని వారింట్లోనే బందీలుగా చేసుకున్నారు ఉగ్రవాదులు. వారిలో 18 ఏళ్ల కుమార్తె వారికి ఎదురుతిరగడంతో ఆమెను అతి దారుణంగా చంపేసినట్లు తెలుస్తోంది. 18 ఏళ్ల బిడ్డ గదిలో శవమవ్వడంతో బాధిత తల్లిదండ్రుల బాధ వర్ణించలేనిది. కూతురు శవం చూసి ఏడ్చే పరిస్ధితి కూడా లేదు. ఎక్కడ తమను చంపేస్తారనే భయంతో అమ్మాయి తల్లిదండ్రులు మిగతా నలుగురు ప్రాణాలు అరచేత పెట్టుకుని నేలపై కూర్చున్నారు. సమీపంలో పేలుడు శబ్దాలు పెద్ద పెద్దగా వినిపిస్తుండడంతో కుటుంబంలో చిన్నపిల్లలు గుక్క పట్టి ఏడుస్తున్నారు. అయితే, వారికి కాపలాగా ఓ ఉగ్రవాది నోరు తెరవొద్దని హెచ్చరించాడు. అక్క మరణాన్ని తట్టుకోలేని ఆ ఐదేళ్ల చిన్నారి గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఆమె తిరిగి వచ్చే అవకాశం లేదని మరో చిన్నారి అంటే.. రిలాక్స్ అంటూ ఉగ్రవాది పెద్దగా అరవడం వీడియోలో వినిపిస్తోంది. అంతేకాదు, ఆమె స్వర్గానికి వెళ్లిందని వారితో చెప్పాడు.
హనన్య నఫ్తాలీ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. హమాస్ ఉగ్రవాదుల చేతిలో ఈ ఇజ్రాయెల్ (Israel) కుటుంబం బందీగా ఉందని, వారి ముఖాలను ఒకసారి చూడాలని ఆ యూజర్ అభ్యర్థించారు. ఆ కుటుంబం బతికి ఉందో, లేదో తెలియదని, కానీ ఇది హృదయవిదారకమని పేర్కొన్నారు. ఇది మానవత్వంపై జరుగుతున్న నేరమని, ప్రపంచనాయకులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: జెరూసలెంలో చిక్కుకున్న 27మంది భారతీయులు..విదేశీయులను లక్ష్యంగా చేసుకున్న టెర్రరిస్టులు..!!