Taylor Swift: పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌పై దాడికి ISIS ప్లాన్..! ఆస్ట్రియా-వియన్నాలో పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కచేరీ ప్రదర్శనపై ISIS ఉగ్రవాదులు దాడి చేయాలని ప్లాన్ వేశారు. అయితే ఈ విషయం ముందుగానే నిర్వహకులకు తెలిసింది. దీంతో వియన్నాలో మూడు రోజుల పాటు జరిగనున్న టేలర్ స్విఫ్ట్ కార్యక్రమాలను నిర్వాహకులు రద్దు చేశారు. By Durga Rao 09 Aug 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ISIS Planned Suicide Attack: ఆస్ట్రియాలోని వియన్నాలో పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ (Taylor Swift) కచేరీ సందర్భంగా ISIS ఉగ్రవాదులు పలువురిని హతమార్చే కుట్ర విచారణలో వెల్లడైంది. వియన్నాలో నిన్నటి నుంచి మూడు రోజుల పాటు కచేరీలు జరగాల్సిఉంది. అయితే ఈ కార్యక్రమాల్లో ISIS ఉగ్రవాదులు బాంబులు పేల్చేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందటంతో నిర్వాహకులు వాటిని రద్దు చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ యూరప్ దేశాల్లో ప్రదర్శనలు ఇస్తోంది. దీని ప్రకారం ఆస్ట్రియాలోని వియన్నాలో నిన్న (ఆగస్టు 8) నుంచి మూడు రోజుల పాటు కచేరీలు నిర్వహించాలని ప్లాన్ చేసుకుంది. అయితే ఈ కార్యక్రమాలు నిర్వహించే వేదికల పై ISIS ఉగ్రవాదులు బాంబులు పేల్చేందుకు ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ కార్యక్రమాలను నిర్వాహకులు రద్దు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఆస్ట్రియాకు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. వీరిద్దరూ ఉగ్రవాద సంస్థ ISIS నుంచి స్ఫూర్తి పొంది దానికి మద్దతుదారులని తెలిపారు. టేలర్ స్విఫ్ట్ కచేరీకి వేలాది మంది ప్రజలు హాజరవుతారు కాబట్టి, వారు వీలైనంత ఎక్కువ మందిపై దాడి చేసి చంపాలని ప్లాన్ చేశారు. వారి ఇళ్లలో ISIS సంస్థకు సంబంధించిన పత్రాలు, పేలుడు పదార్థాలు, కత్తులతో సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరికి ISISతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా అనేది తెలియరాలేదని విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. Also Read: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు #isis-terrorists మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి