Ambani : అంబానీ భవనాన్ని భారీ ధరకు కొనుగోలు చేసిన హాలీవుడ్‌ స్టార్‌ జంట!

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ లాస్‌ఏజెంల్స్‌లో ఉన్న ఓ మాన్షన్‌ ను విక్రయించారు. ఈ మాన్షన్‌ను అమెరికన్‌ స్టార్‌ సింగర్‌ జెన్నీఫర్‌ లోపేజ్‌ కు అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి.

New Update
Ambani : అంబానీ భవనాన్ని భారీ ధరకు కొనుగోలు చేసిన హాలీవుడ్‌ స్టార్‌ జంట!

Hollywood Star Couple : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(Reliance Industries) అధినేత ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) ముద్దుల తనయ ఇషా అంబానీ(Isha Ambani) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రిలయన్స్‌ రీటైల్స్‌ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించుకుంది. ఇక ఇషాకు ప్రముఖ బిజినెస్‌ మెన్‌ ఆనంద్‌ పిరమాల్‌(Anand Piramal) తో వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ జంటకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.

ఈ జంటకు విదేశాల్లో అత్యంత విలువైన ప్రాపర్టీస్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే, లాస్‌ఏజెంల్స్‌లో ఉన్న ఓ మాన్షన్‌(Los Angeles Mansion) ను ఇషా – ఆనంద్‌ జంట విక్రయించినట్లు సమాచారం. అత్యంత విలాసవంతమైన ఇంద్రభవనంలాంటి ఈ మాన్షన్‌ను అమెరికన్‌ స్టార్‌ సింగర్‌ జెన్నీఫర్‌ లోపేజ్‌(Jennifer Lopez) – బెన్‌ అఫ్లెక్‌(Ben Affleck) జంట కొనుగోలు చేసిందంట. ఈ ఇంటిని దక్కించుకునేందుకు గతేడాది జూన్‌లో జెన్నీఫర్‌ జంట రూ.500 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

లాస్‌ ఏంజెల్స్‌లోని బెవర్లీ హిల్స్ నడిబొడ్డున ఉన్న ఈ మాన్షన్‌ను 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5.2 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో మొత్తం 12 బెడ్‌రూమ్‌లు, 24 బాత్‌రూమ్‌లు, ఒక ఇండోర్ పికిల్‌బాల్ కోర్ట్, జిమ్‌, సెలూన్, స్పాలు, 155 అడుగుల పొడవైన ఇన్ఫినిటీ పూల్, అవుట్‌డోర్ కిచెన్ వంటివి ఉన్నట్లు తెలిసింది.

ఇక ఈ మాన్షన్‌తో ఇషా అంబానీకి ఉన్న అనుబంధం చాలా ప్రత్యేమైనదిగా చెప్పొచ్చు. ఎందుకంటే 2022లో ఇషా తన ప్రెగ్నెంట్‌ టైమ్‌ మొత్తం తల్లి నీతా అంబానీతో కలిసి ఈ ఇంట్లోనే గడిపిందట. అదే ఏడాది నవంబర్‌లో ఇషా ఇద్దరు పిల్లలు కృష్ణ, ఆదిత్యకు జన్మనిచ్చింది. డెలివరీ అనంతరం ఇండియాకు తిరిగి వచ్చేసింది. ఇప్పుడు ఆ ఇంటినే జన్నీఫర్‌ జంటకు విక్రయించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అంత ఖరీదైన మాన్షన్‌ను ఇషా ఎందుకు విక్రయించిందనే విషయం మాత్రం తెలియరాలేదు.

Also Read : తెలంగాణ విద్యార్థులకు షాక్‌.. ఆ పరీక్షలు వాయిదా

Advertisment
Advertisment
తాజా కథనాలు