ప్రతి రిలేషన్ షిప్ లో తొలి రోజుల్లో ఉండే ఆప్యాయత, అనురాగం జీవితాంతం స్వీట్ మెమోరీస్ గా నిలిచిపోతాయి. నిజంగానే స్త్రీ, పురుషుల బంధంలో తొలినాళ్లలో ఒకరిని వదిలి ఒకరు విడిచి అసలే ఉండలేరు. ఏ కాస్త దూరం పెరిగిన ప్రాణం పోయినంతగా ఫీల్ అవుతుంటారు. అలాగే పెళ్లైన భాగస్వాములు సైతం కొంతకాలం ఒకరిగురించి ఒకరు ఆలోచిస్తూ అదే ఊహల్లో ఉండిపోతారు. బయటకు వెళ్లిన పార్ట్ నర్ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఇదంతా మీ జీవింతలో ముణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయిందా? కొన్ని రోజులు లేదా నెలల తర్వాత మీ ఇద్దరికీ రిలేషన్ షిప్ విషయంలో బోర్ కొడుతోందా? అయితే ఈ సమస్యను అధిగమించి మీ భాగస్వామిని మరోసారి ప్రేమలో పడేయడానికి ఈ టిప్స్ ఫాలో కవాలంటున్నారు నిపుణులు.
మొదటగా మీ భాగస్వామి దూరం కావడానికి గల కారణాలేంటో తెలుసుకోవాలి. మీతో మరోసారి ప్రేమలో పడేయటానికి ప్రేమను ఎక్కడ మిస్సవుతున్నారో గ్రహించాలి. లేదంటే మీ సమస్యను పరిష్కరించలేరు. పార్ట్ నర్ తో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి. మీ ఇద్దరి రిలేషన్ షిప్ లో దూరమయ్యేందుకు గల కారణాన్ని మీరు కనుగొనాలి. ఆ తర్వాత మీ భాగస్వామితో ఏమి మాట్లాడాలో గుర్తుంచుకోండి. ఓపెన్ మైండ్ తో హెల్దీ కమ్యూనికేషన్ చేయండి. ఇది మీ సంబంధానికి మీ కీలకమని తెలుసుకోవాలి. మీరు గతంలో ఒకరితో ఒకరు కలిగి ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకోండి. మీరిద్దరూ ఏవేవి ఇష్టపడతారో.. మీకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయో వాటి గురించి మాట్లాడొచ్చు. ఇలా మీరిద్దరూ మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవచ్చు. ఒకరితో ఒకరు ఎక్కువగా.. మీ సంబంధం ప్రారంభంలో సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకోండి.
ఇది కూడా చదవండి : చెప్పినమాట వినట్లేదని ఎంపీని సస్పెండ్ చేసిన బీఎస్పీ
అలాగే మీ సంబంధంలో కోల్పోయిన ప్రేమను తిరిగి తీసుకురావడానికి లాంగ్ డ్రైవ్ వెళ్లండి. దీని వల్ల పాస్ట్ లైఫ్ స్వీట్ మెమోరీస్ గుర్తొస్తాయి. అలాగే కొన్ని ఆశ్చరపరిచే బహుమతులు ఇచ్చి మీ భాగస్వామిని సర్ ప్రైజ్ చేయండి. మీ భాగస్వామి మీతో మరోసారి ప్రేమలో పడటానికి ఇది మీకు కచ్చితంగా సహాయపడుతుంది.
మళ్లీ ప్రేమ లేఖలు, అందమైన పువ్వులు, డ్రెస్ వంటివి ఇవ్వొచ్చు. ఇక ముఖ్యంగా మనిషి జీవితంలో శృంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా మారాలంటే వారి రిలేషన్ రొమాంటిక్ గా ఆనందంగా కొనసాగాలన్నా శృంగారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే శృంగారం అనేది ఒక సహజమైన ప్రక్రియ. మన శరీరానికే కాదు మనసును కూడా మార్చే శక్తి దీనికి ఉంటుందంటున్నారు మానసిక నిపుణులు.