Relationship Tips: ఇప్పుడున్న జనరేషన్ పెళ్లికి అంతా ప్రియారిటి ఇవ్వటం లేదు. పూర్వకాలంలో పద్ధతులు, ఆచారాలు వేరుగా ఉండేటివి. కానీ.. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఫ్రీడమ్ కూడా ఎక్కువైపోయింది. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ లైఫ్ వేస్ట్, సోలో లైఫ్ ఏ బెస్ట్ అన్నా రీతిలో చాలామంది ఉన్నారు. అందువలన ఆ బంధాలకి ఎక్కువ విలువ ఇవ్వడం లేదు. అంతేకాకుండా.. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారు కూడా కొంత కాలం కూడా కలిసి ఉండలేకపోతున్నారు. దీనికి ముఖ్య కారణం వివాహేతర బంధాలని (Extramarital affairs) నిపుణులు చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య మూడో వ్యక్తి వస్తే ఇక మూడో ప్రపంచ యుద్ధమే. అయితే ఇదంతా జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందు దాన్ని దీనిని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అంటున్నారు. మీ భాగస్వామి వేరే వారితో వివాహేద్ర బంధం పెట్టుకుంటే.. కొన్ని లక్షణాలను గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
జీవిత భాగస్వామి దూరం అవ్వడానికి ఇవే కారణాలు
➡ఓ రకంగా చెప్పాలంటే.. జీవితం పాడవడానికి ముఖ్య కారణం ఫోన్ (Mobile). మీ పార్టనర్ ఎక్కువసేపు ఫోన్ వాడితే మీరు ఓవైపు కనబడుతూ ఉండాలి. అత్యవసర పనులు ఉన్నప్పుడు వాడుకుంటే ఏమీ కాదు. కానీ.. అదే నిత్యం ఫోన్ వాడుతుందటే వారు వేరే వారికి దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు. కావున.. ఫోన్ ఎక్కువ గడిపేవారు వారిని గమనించాలి. అలా అని ఫోన్ మాట్లాడే ప్రతి ఒక్కరు తప్పు చేసినట్లు కాదు. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే మంచిది.
➡భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. చిన్న చిన్న సరదాలైన ముద్దుపెట్టుకోవడం, ప్రేమగా మాట్లాడడం, కౌగిలించుకోవడం ఉంటాయి. అయితే.. వీళ్లు వేరే వారికి దగ్గరవుతుంటే ఇలాంటివి చేయడానికి ఇష్టపడరు.
➡కొన్ని సీక్రెట్ (Secrets) మెంటెయిన్ చేస్తారు ఇది కూడా గమనించాలి. భార్యాభర్తల్లో ఎవరైనా సరే ఎవరికి వారు ఫ్రీగా ఉండటం కష్టం. వారి ఫోన్స్, గ్యాడ్జెట్స్‌ని దాచేస్తుంటారు. అంతేకాదు ఫోన్‌కి పాస్‌వర్డ్స్ పెట్టుకుంటారు. మీరు గొడవపడి ఫోన్ పాస్ వర్డ్ తెలుసుకున్నా.. కొన్ని రోజుల తరువాత మళ్లీ దానిని మారుస్తారు. కావునా.. ఇలాంటివి చేసినా మీ భాగస్వామి కాస్తా అనుమానించాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు.
➡ఇలా మీ పార్టనర్ ప్రవర్తన రోజు రోజుకు మరుతుఉంటే వారిని మార్చేందుకు ప్రయత్నించాలి. అలాగని వారిపై ఎక్కువ ఒత్తిడి పెట్టవద్దు. వారు మారితే మంచిదే. అప్పుడు మీరు చేసిన ప్రయత్నం వృధానే కాదు. మీతో బంధం (Relation) మెరుగ్గా ఉండాలంటే వారే మార్పును కోరుకుంటారు. అప్పటికి వారికతో మార్పు రాకపోతే.. ఇష్టపడేవారిని మిస్ అవుతారు.
ఇది కూడా చదవండి: డబ్బు, హోదా అక్కర్లేదు.. ఇలా చేస్తే మీ లైఫంతా హ్యపీనే..!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.