ITR Filing: గతేడాది ఐటీ రిటర్న్స్ వేయలేదా? ఇప్పుడు రిటర్న్స్ ఫైల్ చేయవచ్చా? ఐటీ రిటర్న్స్ సమయానికి ఫైల్ చేయడం ముఖ్యం. చాలామంది ఐటీ రిటర్న్స్ వేయడంలో అశ్రద్ధ చేస్తారు. ఒక్కోసారి ఇబ్బందుల కారణంగా ఐటీఆర్ ఫైల్ చేయడం మిస్ అవుతారు. అటువంటి వారు రెండు ఐటీ రిటర్న్స్ ఒకేసారి ఫైల్ చేసే అవకాశం ఉంది. దానికోసం ఏమి చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 28 Apr 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్ కోసం మరింత సమయం ఉంది. దీనికి చివరి తేదీ 31 జూలై 2024. ఇప్పటి వరకు కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల గత సంవత్సరం ఐటీఆర్ ఫైల్ చేయలేకపోయిన చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. అటువంటి వారికి ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ (ITR Filing) చేసే అవకాశం ఉందా? అలా అయితే, దానికోసం ఏమి చేయాలి? ఎంత ఫైన్ కట్టాల్సి ఉంటుంది? అంతేకాకుండా, ITR ఫైల్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఈ కథనంలో తెలుసుకుందాం. ఇంకా అవకాశం ఉందా? వ్యక్తులు, కార్పొరేషన్లు, ఆడిట్ చేసిన-ఆడిట్ చేయని పన్ను చెల్లింపుదారులతో సహా పన్ను చెల్లింపుదారులందరికీ డిసెంబర్ 31 గడువు తేదీ వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234AF ప్రకారం, గడువు తేదీకి ముందు రిటర్న్‌లను ఫైల్ చేయడంలో విఫలమైన వ్యక్తులపై లేట్ ఫైలింగ్ ఛార్జీలు విధిస్తారు. గడువులోపు రిటర్న్స్ ఫైల్ చేయని వారికి రూ.5,000 జరిమానా ఉంటుంది. అయితే, మొత్తం ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులు కేవలం రూ.1,000 మాత్రమే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులకు గత రెండు సంవత్సరాల ITR ఫైల్(ITR Filing) చేసే హక్కు ఉంది. నిర్దేశిత పెనాల్టీతో వీరు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. అంటే రెండేళ్ల నుంచి ఏదైనా ఇబ్బందులతో ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే ఇప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపొతే, వారు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: కోటక్ మహీంద్రాకు ఆర్బీఐ బిగ్ షాక్.. క్రెడిట్ కార్డులతో పాటు, ఆన్లైన్ బ్యాంకింగ్.. ఆదాయపు పన్ను యొక్క అసెస్మెంట్ ఆర్డర్ చెల్లుబాటు అయ్యే చిరునామా రుజువుగా అంటే ఎడ్రస్ ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది. ఇందులో పనిచేసే వారికి ఫారం 16, వ్యాపారవేత్తలకు ఆదాయ రుజువుగా ఐటీఆర్ పనిచేస్తుంది. మీరు లోన్ కోసం అప్లై చేసినప్పుడు మీ CIBIL స్కోర్ తో పాటు ITR కూడా పరిగణనలోకి తీసుకుంటాయి బ్యాంకులు. బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందు మీ ITRని తనిఖీ చేస్తాయి. ITR ఫైల్ చేసినట్టయితే, మీ లోన్ ప్రాసెసింగ్ సులభం కావడమే కాకుండా, మీరు సులభంగా లోన్ పొందుతారు. నష్టపోయినా కూడా ఐటీఆర్ ఉపయోగపడుతుంది మీరు సంపాదిస్తేనే ఐటీఆర్ ఫైల్ చేయాలని కాదు. మీరు మీ వ్యాపారంలో భారీ నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, మీకు ఇప్పటికీ ITR అవసరం. నిజానికి, ఐటీఆర్ ద్వారానే మీరు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని చెప్పగలుగుతారు. అందుకే ప్రతి సందర్భంలోనూ దాని అవసరం పెరుగుతుంది. #itr-filing #late-itr-filing-process #itr-filing-missed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి