Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును ఏపీలోని ప్రతిపక్షాలతో పాటు కొంతమంది జాతీయ నాయకులు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా కొన్ని రోజులుగా తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు.

Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..?
New Update

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును ఏపీలోని ప్రతిపక్షాలతో పాటు కొంతమంది జాతీయ నాయకులు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా కొన్ని రోజులుగా తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సైతం చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి మల్లారెడ్డి కూడా చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని జగన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

చంద్రబాబు అరెస్టుపై తీవ్ర నిరసనలు..

ఇక మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ మోత్కుపల్లి నర్సింహులు అయితే జగన్‌పై నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్​ ఘాట్​ దగ్గర నిరసన దీక్ష కూడా చేపట్టారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అయన్ను అరెస్ట్‌ చేశారని.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు కూడా లేని వ్యక్తిని ఎలా అరెస్ట్‌ చేస్తారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేయాలంటే... 17A ప్రకారం గవర్నర్‌ అనుమతి ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల కోసం రూ.8లక్షల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు కేవలం రూ.300 కోట్లకు ఆశపడతారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్​ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. మరోవైపు ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అయితే చంద్రబాబుకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీకి స్వయంగా నాయకత్వం వహించారు. వీరితో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు చేపడుతున్నారు.

publive-image

వ్యూహాత్మక మౌనంగా బీఆర్ఎస్ పెద్దలు..

అయితే బీఆర్ఎస్ పెద్దలు మాత్రం చంద్రబాబు అరెస్టుపై పెద్దగా స్పందించలేదు. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం స్పందిస్తూ చంద్రబాబుకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. అయితే త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో టీడీపీ సానుభూతిపరులు ఓట్లు పొందేందుకే వీరు చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారని కొంతమంది చెబుతున్నారు. మరికొంతమంది ఏమో గతంలో టీడీపీలో పనిచేసిన బీఆర్ఎస్ నేతలంతా ఇలా చంద్రబాబుపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారని వెల్లడిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం వ్యూహాత్మకంగానే మౌనంగానే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే తమ పార్టీ నేతలు చంద్రబాబుకు మద్దతుగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా ఆంధ్రా సెటిలర్లు ఉండటం.. వారు కూడా టీడీపీ సానుభూతిపరులు అధికం కావడంతో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ.. బాలకృష్ణ, లోకేష్ తో పాటు మరో 12 మందికి చోటు..

#chandrababu #chandrababu-arrest #brs-leaders
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe