హైదరాబాద్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. శామీర్‌పేటలోని సెలబ్రిటీ రిసార్ట్‌లో మనోజ్ కుమార్ అనే నటుడు కాల్పులకు దిగాడు. సిద్దార్థ్‌దాస్ అనే వ్యక్తిపై మనోజ్ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో సిద్దార్థ్ దాస్‌కు గాయాలైయ్యాయి. అయితే మనోజ్ కుమార్ మౌన పోరాటంతో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. అయితే వివాహేతర సంబంధమే ఈ కాల్పులకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మనోజ్ కుమార్ రిసార్ట్‌లోని ఓ విల్లాలో ఉన్న సమయంలో సిదార్థ్ దాస్ అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే జరిగిన వాగ్వాదం కాల్పులకు దారితీసినట్టుగా సమాచారం. మనోజ్ కుమార్ తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో పిల్లెట్స్ నుంచి తప్పించుకన్న సిద్దార్థ్ దాస్ డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం మనోజ్ కుమార్, సిద్దార్థ్ దాస్‌తో పాటు మహిళ పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే సిదార్థ్ దాస్ భార్యకు మనోజ్ కుమార్‌తో వివాహేతర సంబంధం ఉందని.. వారు రిసార్ట్‌లో ఉన్నారనే సమాచారంతో సిదార్థ్ దాస్ అక్కడికి వెళ్లడంతో ఘర్షణ చోటుచేసుకున్నట్టుగా చెబుతున్నారు. తెల్లవారుజామున మనోజ్ విల్లాకు వచ్చిన సిద్ధార్థ్ మధ్య మాటామాటా పెరగడంతో సిద్ధార్థ్‌పై మనోజ్ కాల్పులు జరిపినట్టు సమచారం. తన భర్త రావొద్దని కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయంటున్న సిద్ధార్థ్ భార్య తెలిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు.