వైసీపీలో ఆ వారసులకు లైన్ క్లీయర్ అయ్యిందా?

జగన్ ఒక్క అవకాశం ఇస్తే చాలు... తమ సత్తా ఏంటో చూపించుకోవడానికి సిద్ధంగా ఉన్న వారసులకు.. జగన్ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. చాలాకాలంగా సీఎం జగన్ దగ్గర పెండింగ్ లో ఉన్న వారసుల రాజకీయ ఆరంగేట్రం లిస్టు కి లైన్ క్లియర్ అయినట్టు తాడేపల్లి లో టాక్ నడుస్తుంది. వైసీపీలో చాలామంది వారసులు తమ రాజకీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు.. తమ తండ్రులు సత్తా చాటిన నియోజకవర్గం నుండి బరిలోకి దిగాలనుకుంటున్న వైసీపీ యువ నాయకుల లిస్ట్ వైసీపీ లో చాలానే ఉంది

వైసీపీలో ఆ వారసులకు లైన్ క్లీయర్ అయ్యిందా?
New Update

వైసీపీ(Ycp)లో తమ వారసులను రంగంలోకి దింపాలి అనుకుంటున్నా సీనియర్స్(seniors) కి జగన్(ys jagan) శుభవార్త చెప్పబోతున్నారా? చాలాకాలంగా ఎదురుచూస్తున్న వారసుల ఆరంగేట్రంకి జగన్ పచ్చ జెండా ఊపేరా? వైసీపీలో యువ రక్తం సత్తా చాటుతుందా?.. వారసులకు లైన్ క్లియర్ అయిందా? ఇంతకీ లైన్ క్లియర్ అయినా ఆ వారసులు ఎవరు ? పెండింగ్ లిస్ట్ లో ఉన్నది ఎంతమంది? రీడ్ దిస్ స్టోరీ..

జగన్ ఒక్క అవకాశం ఇస్తే చాలు... తమ సత్తా ఏంటో చూపించుకోవడానికి సిద్ధంగా ఉన్న వారసులకు.. జగన్ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. చాలాకాలంగా సీఎం జగన్ దగ్గర పెండింగ్ లో ఉన్న వారసుల రాజకీయ ఆరంగేట్రం లిస్టు కి లైన్ క్లియర్ అయినట్టు తాడేపల్లి లో టాక్ నడుస్తుంది. వైసీపీలో చాలామంది వారసులు తమ రాజకీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు.. తమ తండ్రులు సత్తా చాటిన నియోజకవర్గం నుండి బరిలోకి దిగాలనుకుంటున్న వైసీపీ యువ నాయకుల లిస్ట్ వైసీపీ లో చాలానే ఉంది

publive-image భూమన అభినయ్ రెడ్డి

అయితే వైసీపీలో తమ వారసులను ఎన్నికల బరిలో దింపాలని చాలామంది సీనియర్ నేతలు తహతహలాడుతున్నారు. తాము రిటైర్మెంట్ తీసుకుని తమ వారసులను ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు .దానిలో భాగంగానే పార్టీ అధినేత జగన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

publive-image బాలినేని ప్రణీత్

తమ వారసులకు అవకాశం ఇవ్వాలని పదేపదే అడుగుతున్నారు. ఇలా తమ వారుసులను బరిలోకి దింపాలనుకుంటున్న నేతల లిస్టులో చాలామంది నేతలు ఉన్నట్టు సమాచారం.ప్రస్తుతానికి వారసుల లిస్ట్‌లో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినవరెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి,

perni kittu పేర్ని కిట్టు

బొత్స సత్యనారాయణ వారసుడు బొత్స సందీప్ ,అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కొడుకు ప్రణయ్ రెడ్డి ,స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి ,తోట త్రిమూర్తులు కుమారుడు తోట పృద్వి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ,,మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు, మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్, మంత్రి కారుమూరు నాగేశ్వరావు వారసుడు కారుమూరు సునీల్ వున్నారు.

byreddy sidharth reddy బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి

వీరితో పాటు మంత్రి గుమ్మనూరు జయరాం వారసుడు గుమ్మనూరు ఈశ్వర్ , గుంటూరు తూర్పు నియోజకవర్గం ముస్తఫా కుమార్తె సైదా లాంటివారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరిని వైసీపీ అధినేత మొన్నటి వరకు ఫైనల్ చేయలేదు. పార్టీలో పార్టీలు సీనియర్ రాజకీయ నాయకులు కొనసాగితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని జగన్ మొన్నటి వరకు చెబుతూ వచ్చారు.. కొత్త వాళ్లతో ప్రయోగం చేయడానికి ఇది టైం కాదని.. 2024 తర్వాత కచ్చితంగా వారసులకు అవకాశాలు ఇస్తానని జగన్ చెబుతూ వచ్చారు..

#ycp #botsa-pradeep #perni-kittu #byreddy-sidharth-reddy #cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe