Telangana: బీఆర్‌ఎస్‌పై బీజేపీ పంజా.. రేపు హైదరాబాద్‌లో ఐటీ దాడులు జరిగే ఛాన్స్..!

తెలంగాణకు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. యుద్ధం వాతావరణం నెలకొంది. అప్పుడే ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) రాకతో రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. రెండు సభల్లో ప్రధాని ప్రసంగం ఒక ఎత్తైతే.. గురువారం జరుగబోయే సీన్ మరో ఎత్తు ఉండబోతుందని తెలుస్తోంది. అవును, బీఆర్ఎస్ టార్గెట్‌గా ఐటీ దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది. గురువారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ మద్దతుదారులపై ఐటీ దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Telangana: బీఆర్‌ఎస్‌పై బీజేపీ పంజా.. రేపు హైదరాబాద్‌లో ఐటీ దాడులు జరిగే ఛాన్స్..!
New Update

IT Raids in Telangana: తెలంగాణకు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. యుద్ధం వాతావరణం నెలకొంది. అప్పుడే ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) రాకతో రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. రెండు సభల్లో ప్రధాని ప్రసంగం ఒక ఎత్తైతే.. గురువారం జరుగబోయే సీన్ మరో ఎత్తు ఉండబోతుందని తెలుస్తోంది. అవును, బీఆర్ఎస్ టార్గెట్‌గా ఐటీ దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు హైదరాబాద్ కు భారీగా తరలివచ్చారు ఐటీ అధికారులు. గురువారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ మద్దతుదారులపై ఐటీ దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్‌కు ఎన్నికల ఫండింగ్ అందించే అవకాశం ఉన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లే టార్గెట్‌గా ఐటీ దాడులు జరుగబోతున్నాయని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఒక రోజు ముందుగానే ఢిల్లీకి జగన్.. ముందస్తు ఎన్నికల కోసమేనా?

ఎన్నికల సమయంలో ఫండింగ్ అనేది ఏ పార్టీకైనా కీలకం. ఆ ఫండింగే నిలిచిపోతే.. ఎన్నికల్లో నిలవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే.. బీఆర్ఎస్ ఆర్థిక వనరులపై ఎటాక్ చేయాలని బీజేపీ ప్లాన్ వేసిందట. ఇందులో భాగంగానే ఐటీ అధికారులను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల లక్ష్యంగా దాడులు చేసి బీఆర్ఎస్ పార్టీకి నిధులు అందకుండా చేయాలని భారీ ప్లాన్ వేశారట. వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. గురువారం ఉదయం నుంచే నగరం వ్యాప్తంగా ఐటీ దాడులతో హడావుడి చేయనున్నట్లు తెలుస్తోంది.

మహబూబ్‌నగర్, నిజామాబాద్ సభల్లో బీఆర్‌ఎస్ టార్గెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం ఉందని, వారి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తానంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు.. కేసీఆర్ తన కొడుకును సీఎం చేయడానికి తన ఆశీర్వాదం కోరారని, అందుకు తాను తిరస్కరించానని చెప్పారు. కేసీఆర్ పాలన అంతా అవినీతిమయం అని ఆరోపించారు. ఇలా ఆరోపణలు చేసి వెళ్లారో లేదో.. అలా ఐటీ అధికారులు నగరంలోకి వాలిపోయారు. ఇక దాడులకు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ ఐటీ దాడులు ఎవరెవరిపై చేస్తారనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. రేపు పరిస్థితి ఎలా ఉంటుందో.. ఎవరిపై ఐటీ దాడులు జరుగుతాయో.. రాజకీయంగా ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తాయో అని పొలిటికల్ సర్కిల్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇదికూడా చదవండి: Telangana Police Constable Results: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అప్‌డేట్.. ఫలితాలు ఎప్పుడంటే..

#hyderabad-news #brs-party #income-tax-department #brs-supporters #bjp-vs-brs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe