Health Tips : బ్రాందీ తాగితే జలుబు..దగ్గు ఫసక్...ఏంటీ బ్రో ఇది నిజమేనా.. ? చలికాలంలో జలుబు, దగ్గు వేధిస్తుంటాయి. అయితే ఈ కాలంలో రాత్రిపూట బ్రాందీ లేదా రమ్ తాగితే జలుబు, దగ్గు తగ్గుతుందట. వీటితోపాటు కీళ్లనొప్పులు, రమాటిజం కూడా నయం అవుతుందని శాస్త్రీయంగా రుజువైంది. By Bhoomi 28 Nov 2023 in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి చలికాలం షురూ అయ్యింది. ఈ కాలంలో దగ్గుతోపాటు జలుబు వేధిస్తుంది. వీటి నుంచి బయటపడేందుకు చాలా మంది మందులు తీసుకుంటారు. ఇంకొంతమంది చలికాలంలో రాత్రిపూట బ్రాందీ కానీ రమ్ కానీ తాగితే..దగ్గు, జలుబు దగ్గుతుందనుకుంటారు. అసలు ఇందులో వాస్తవమెంత. శాస్త్రీయంగా ఏది సరైనది. ఇందులో ఉన్న నిజామేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రాందీ, రమ్ తాగితే జలుబుతోపాటు, కీళ్ల నొప్పులు, రుమాటిజంయ కూడా నయం అవుతుందని శాస్త్రీయంగా పేర్కొంటున్నారు. దీంతోపాటు గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట. అంతేకాదు ధమనుల నిరోధంలో కూడా దాని ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది శ్వాసకోశ సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. వాటిలో శోథనిరోధక లక్షణాలు ఉన్నాయట. సైన్స్ ఏం చెబుతోంది? సైన్స్ మాత్రం ఆల్కహాల్ వెచ్చదనాన్ని అందిస్తుందని నమ్ముతుంది. అంటే బలమైన ఆల్కహాల్ మరింత వేడిని అందిస్తుంది. కారీ రోగాలు నయం చేస్తుందన్న వాదనలు చూస్తే మాత్రం అవి పూర్తి నిరాధారమైదిగా కనిపిస్తాయి. ఆల్కహాల్ అన్ని కోణాల్లో శరీరానికి హానిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. రమ్ లేదా బ్రాందీ అయినా...మీ శరీరం ఇమ్యూనిటీని బలహీనపరుస్తాయి. ఇక కొంచెం మందు తాగితే పర్లేదని.. అప్పుడప్పుడు మద్యం సేవించవచ్చని కొంతమంది చెబుతుంటారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజంలేదని డాక్టర్లు కుండబద్దలు కొడుతున్నారు. ఒకవేళ ఎవరైనా డాక్టర్ ఇలా కొంచెం తాగమని చెబితే అతడిని అసలు నమ్మవద్దని మెడికల్ ప్రొఫెషనల్స్ తేల్చిచెబుతున్నారు. ఆల్కహాల్ వల్ల ప్రయోజనాలు ఏ మాత్రం లేవని ఖరాఖండిగా చెబుతున్నారు. ఆల్కహాల్ వినియోగం మీ ఆరోగ్యానికి సురక్షితం కాదు. ఆల్కహాల్ ప్రజలను పేదలుగా, మూగగా, లావుగా, అనారోగ్యంగా మారుస్తుంది. అనేక కారణాల వల్ల మద్యం ప్రమాదకరం: ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుది. దీర్ఘకాలిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ హెపటైటిస్, సిర్రోసిస్ లాంటి కాలేయ వ్యాధులు వస్తాయి. హృదయ సంబంధ సమస్యలు కూడా మద్యపానం వల్లే వస్తాయి. అధికంగా మద్యపానం చేయడం వలన అధిక రక్తపోటు, కార్డియోమయోపతి, సక్రమంగా లేని హృదయ స్పందన వచ్చే ప్రమాదం ఉంది. ఇక క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచేది ఆల్కహాలే. ఎక్కువగా తాగితే కాలేయం, రొమ్ము, అన్నవాహిక క్యాన్సర్‌తో సహా కొన్ని క్యాన్సర్‌లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అభిజ్ఞా పనితీరును దెబ్బతీస్తుంది. ఇది ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సమన్వయంలో ఇబ్బందులకు దారితీస్తుంది. మానసిక సమస్యలు: ఆల్కహాల్ ఒక అడిక్షన్. అధిక మద్యపానం ఆల్కహాల్ డిపెండెన్స్ లేదా ఆల్కహాల్ యూజ్ డిజార్డర్‌కు దారి తీస్తుంది. ఆల్కహాల్ సేవించి రోడ్డుపైకి వస్తే అనేక ప్రమాదాలు జరుగుతాయి. తాగిన వారి ప్రాణాలు పోవడమే కాదు ఏ తప్పూ చేయని వారు కూడా చనిపోతారు. దీర్ఘకాలిక ఆల్కహాల్ వినియోగం డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక ఆరోగ్య రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక ఆల్కహాల్ వినియోగం ప్రమాదకర ప్రవర్తనలకు దారితీస్తుంది. సంబంధాలు, ఉపాధి మరియు మొత్తం జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇది కూడా చదవండి: విద్యార్థులకు షాక్.. రక్షబంధాన్,శ్రీరామనవమి, శివరాత్రి, హోలీ సెలవులు రద్దు. #health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి