Milk-Honey: పాలు, తేనే కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..?

పాలు, తేనే కలిపి తీసుకోవడం చాలా మందికి సురక్షితమే కానీ కొందరిలో ఈ రెండింటి కలయిక ఆరోగ్య సమస్యలను తెచ్చే అవకాశం కూడా ఉంది. కావున వీటిని కలిపి తీసుకునేటప్పుడు దాని వల్ల మీ శరీరంలో వచ్చే అలెర్జీస్ పై అవగాహన ఉండాలి. కొంత మంది శరీరం చాలా సున్నితంగా ఉంటుంది అలాగే కొందరికి ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి అలాంటి వారు వీటిని తీసుకునేటప్పుడు వైద్య నిపుణులను సహకరించాలి.

New Update
Milk-Honey: పాలు, తేనే కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..?

Milk-Honey: పాలు, తేనే(Honey) ఒక మంచి కంబినేషన్ వీటి వల్ల శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . పాలు, తేనే ఈ రెండు పదార్థాలు మన రోజూ వారి దినచర్య లో తరచుగా వాడుతుంటాము. విడి విడిగా చూసుకుంటే పాలు, తేనే వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. కానీ ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల లాభాలు తో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అసలు ఈ రెండింటి కలయిక వల్ల కలిగే లాభాలు నష్టాలేంటో చూద్దాం.

లాభాలు

ఆరోగ్య ప్రయోజనాలు

పాలు, తేనే కలిపి తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు చక్కటి నిద్రకు అలాగే జీవక్రియను మెరుగుపరుస్తుంది. తేనెలోని యాంటీమైక్రోబయాల్ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

సాంప్రదాయ నివారణ

తేనే, పాలు అలాగే సుఘంధ ద్రవ్యాలను కలయికను గొంతు నొప్పి, జలుబు దగ్గు వంటి సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.

అధిక పోషకాలు
పాలు, తేనే కలిపి తీసుకోవడం చాలా ఆరోగ్యకరమైనది. పాలలో అధికంగా ఉండే కాల్షియమ్, ప్రోటీన్, విటమిన్ D వంటి పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే తేనేలోని యాంటియోక్సిడెంట్స్ (antioxidants), మినరల్స్, విటమిన్స్, రోగాల బారిన పడకుండా కాపాడుతుంది.

Also Read: Digestion Tips: ఈ ఐదు పండ్లతో మలబద్ధకానికి చెక్‌..ప్రాబ్లెమ్స్‌ అన్ని ఫసక్‌..!

నష్టాలు

చెక్కెర శాతం పెరగడం

తేనే సహజ చక్కెర. దానిలో చక్కశాతం ఎక్కువగా ఉంటుంది. దానిని తీసుకునే మోతాదు కంటే ఎక్కువ తీసుకోవడం వాళ్ళ పళ్ళ సమస్యలు అలాగే రక్తంలో చెక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.

అధిక కెలోరీ(Calories) కంటెంట్

తేనే, పాలు కలిపి తీసుకోవడం రుచికి బాగా అనిపించినా, శరీరంలో అధిక కేలరీల శాతం ఎక్కువై బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

అలెర్జీస్
కొంత మందిలో ఈ రెండింటి కాంబినేషన్ శరీరంలో అలెర్జీస్ కు దారి తీస్తుంది. కావును వీటిని కలిపి తీసుకునేటప్పుడు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

లాక్టోస్(Lactose)  అసహనీయత

లాక్టోస్ అసహనీయతతో బాధపడేవారికి పాలు, తేనెను కలిపి తీసుకోవడం వాళ్ళ అజీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. లాక్టోస్ అసహనీయత ఉన్నవారు వీగన్(Vegan) పాలు, తేనెను కలిపి తీసుకోవడం మంచిది.

కలుషితం అయ్యే ప్రమాదం

కొన్ని సార్లు తేనెను స్వచ్ఛంగా తీయకపోవచ్చు ఆ కలుషితమైన తేనెను పాలలో కలిపి తాగటం వల్ల జీర్ణక్రియ పై ప్రభావం చూపుతుంది.

చిన్న పిల్లలకు హానికరం

బొటులిజం(botulism) ప్రమాదం ఉన్నందున తేనెను చిన్న సంవత్సరం లోపు పిల్లకు ఇవ్వడం మంచిది కాదు. వారి జీర్ణక్రియ పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. అలాగే తేనెలోని 'క్లోస్ట్రిడియం బోటులినమ్' చిన్న పిల్లలకు హానీ కలిగిస్తుంది.

Also Read: Amla: ఉసిరిని మీ ఆహారంలో చేర్చటం లేదా.. అయితే మీరు లాభాలను కోల్పోయినట్లే..?

Advertisment
తాజా కథనాలు