Bournvita వంటి ప్రోడక్ట్స్ ఇకపై 'హెల్త్ డ్రింక్స్'(Health Drinks) కేటగిరీలో కనిపించవు. వాణిజ్యం-పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని ఇ-కామర్స్ కంపెనీలను వారి వెబ్‌సైట్‌లు.. ప్లాట్‌ఫారమ్‌లలోని 'హెల్త్ డ్రింక్స్' కేటగిరీ నుండి బోర్న్‌విటాతో సహా అన్ని పానీయాలను తొలగించాలని కోరింది. అలాగే, అన్ని కంపెనీలు తమ ఉత్పత్తిని సమీక్షించి సరైన కేటగిరీలో ఉంచాలని డిపార్ట్‌మెంట్ సూచించింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చట్టపరమైన సంస్థ దర్యాప్తులో అటువంటి పానీయాలు(Health Drinks) 'హెల్త్ డ్రింక్స్' కాదని తేలిందని మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్ లో పేర్కొంది. వాస్తవానికి, అటువంటి పానీయాల అమ్మకాలు పెంచడం కోసం, హెల్త్ కేటగిరీ డ్రింక్స్ అంటే ప్రజలలో ఉండే డిమాండ్ కారణంగా కంపెనీ దానిని(Health Drinks) ఆరోగ్య పానీయాల కేటగిరీలో ఉంచుతుందని, ఇది అన్యాయమని మంత్రిత్వ శాఖ చెబుతోంది.
Also Read: ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ మన దేశంలో.. ఏప్పుడురావచ్చంటే..
పిల్లలకు ఇటువంటి డ్రింక్స్ నిజంగా అవసరమా?
బోర్న్‌విటా(Health Drinks) అలానే ఇలాంటి ఇతర పానీయాలను ఆరోగ్య పానీయాల వర్గం నుండి తొలగించిన తర్వాత, ప్రజల మదిలో మెదులుతున్న ఒక ప్రశ్న ఏమిటంటే, చాక్లెట్ పౌడర్‌ని జోడించి పిల్లలకు పాలు తినిపించడం ఆరోగ్యకరమైనదా. పిల్లలకు ఇది నిజంగా అవసరమా? అనేది. దీనికి నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. చాక్లెట్ పౌడర్ హానిపై నిర్దిష్ట పరిశోధన జరగలేదు. ఈ పౌడర్‌ను మంచి కంపెనీ తయారు చేస్తే పెద్దగా నష్టం ఉండదు. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పెద్ద కంపెనీలు దీన్ని తయారు చేస్తాయి.
అయితే పిల్లలకు చాక్లెట్ పౌడర్ ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, దానిని కొనుగోలు చేసేటప్పుడు, తల్లిదండ్రులు దాని పెట్టె లేదా ప్యాకెట్ వెనుక వ్రాసిన పదార్థాలను జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే.. ఒక్కోసారి ఇటువంటి చాక్లెట్ పౌడర్(Health Drinks) లో కృత్రిమ రసాయనాలు కలిపే అవకాశం ఉంది. ఏ కంపెనీ అయినా అట్ట మీద దీని వివరాలు ఇస్తుంది. దానిని బట్టి ఇది వాడచ్చా వాడకూడదా అనేది నిర్ణయించుకోవచ్చు.
ఇక ఇలాంటి చాక్లెట్ పౌడర్ పిల్లలకు ఇచ్చేటప్పుడు దానిని ఎంత పరిమాణంలో ఇవ్వాలనేది సెట్ చేసుకోవాలి. రోజులో ఒకసారి చాక్లెట్ పౌడర్ ఇవ్వడంలో ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతారు. పాలు ఇచ్చిన ప్రతిసారి ఇటువంటి చాక్లెట్ పౌడర్(Health Drinks) కలపడం మంచిది కాదని వారంటున్నారు. ఎందుకంటే, పాలలో చక్కర కలుపుతారు. దీనికి చాక్లెట్ పౌడర్ కూడా కలిపితే అది ప్రమాదకరం అవుతుంది. అందుకే ఇలాంటి చాక్లెట్ పౌడర్ తినడానికి చిన్న బౌల్ లో పిల్లలకు ఇస్తే మంచిది.
పాలలో చక్కరతో పాటు చాక్లెట్ పౌడర్ కలపడం మంచిది కాదు. ఎందుకంటే, చక్కరలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదేవిధంగా పిల్లలు సాధారణ ఆహారం ద్వారా కూడా పిండి పదార్ధాలను అందుకుంటారు. అందువల్ల అదనంగా చాక్లెట్ పౌడర్ రూపంలో కార్బోహైడ్రేట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.
అసలేం జరిగింది..
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కూడా ఏప్రిల్ 10న ఈ సూచన జారీ చేసింది. అంతకుముందు, ఏప్రిల్ 2న, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆహార ఉత్పత్తులను సరైన కేటగిరీలో ఉంచాలని కోరింది. అమ్మకాలను పెంచడానికి పానీయాల(Bournvita)ను హెల్త్ డ్రింక్స్- ఎనర్జీ డ్రింక్స్ అని తప్పుగా లేబుల్ చేయడం సరికాదని రెగ్యులేటర్ పేర్కొంది. మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం భారతీయ ఎనర్జీ డ్రింక్స్ - స్పోర్ట్స్ డ్రింక్స్‌కు బలమైన మార్కెట్ ఉంది. దీని మార్కెట్ పరిమాణం సుమారు $4.7 బిలియన్లు, ఇది 2028 నాటికి 5.71 శాతం CAGR వృద్ధితో వృద్ధి చెందుతుందని అంచనా.
బోర్నవిటా(Bournvita)కు సంబంధించిన హెల్త్ డ్రింక్ సమస్యపై ఇప్పటికే ఎన్‌సీపీసీఆర్ నోటీసులు పంపడం గమనార్హం . ఇందులో పెద్ద మొత్తంలో చక్కెరతో పాటు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే అంశాలకు సంబంధించి బోర్న్‌విటా తయారీ కంపెనీ మోండెలెజ్ ఇంటర్నేషనల్ ఇండియా లిమిటెడ్‌కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గతేడాది నోటీసు పంపింది. అటువంటి పరిస్థితిలో, మీ ప్రోడక్ట్ ను సమీక్షించండి.. అదేవిధంగా ప్రోడక్ట్ ప్యాకేజింగ్ పై ఆరోగ్యకరమైన పానీయం ట్యాగ్‌ను తీసివేయండి అని కమిషన్ చెప్పింది.