Narayana: ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. మాజీ మంత్రి నారాయణ విచారణపై హైకోర్టు కీలక ఆదేశాలు!

మాజీ మంత్రి నారాయణ(Narayana)కు సీఐడీ జారీ చేసిన 41a నోటీసుపై హైకోర్టు(High court)లో విచారణ జరుపుతోంది. మరోసారి నారాయణకు నోటీస్ ఇచ్చి విచారించాలని కోర్టు ఆదేశించింది. నారాయణ ఇంటి వద్ద విచారించాలని చెప్పింది. ఇక ఐఆర్ఆర్ కేసులో నారాయణ అల్లుడు పునీత్ కు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ ఇచ్చిన నోటీసులను డిస్మిస్ చేయాలని పునీత్ పిటిషన్ దాఖలు చేశారు.

New Update
Narayana: ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. మాజీ మంత్రి నారాయణ విచారణపై హైకోర్టు కీలక ఆదేశాలు!

మాజీ మంత్రి నారాయణ(Narayana)కు సీఐడీ జారీ చేసిన 41a నోటీసుపై హైకోర్టు(High court)లో విచారణ జరుపుతోంది. మరోసారి నారాయణకు నోటీస్ ఇచ్చి విచారించాలని కోర్టు ఆదేశించింది. నారాయణ ఇంటి వద్ద విచారించాలని చెప్పింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ జారీ చేసిన నోటీసులపై విచారణను నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. సీఐడీ విచారణపై తన ఆరోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకోవాలని నారాయణ కోరారు. అయితే దీనిపై విచారించిన కోర్టు ఆయనకు మరోసారి నోటిసులు ఇవ్వాలని కోర్టు చెప్పింది. ఇక ఐఆర్ఆర్ కేసులో నారాయణ అల్లుడు పునీత్ కు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ ఇచ్చిన నోటీసులను డిస్మిస్ చేయాలని పునీత్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి నారాయణ ఐఆర్ఆర్ కేసులో సీఐడీ తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనను తప్పనిసరిగా విచారించాలని భావిస్తే.. ఇంటి వద్దనే విచారణ జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. తాను అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. తనకు గతంలో మేజర్‌ సర్జరీలు అయ్యాయని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ జరిగింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

అసలేం జరిగింది?

ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో నిర్మించతలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను మార్పులను టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరిగేలా మార్చారని సీఐడీ అభియోగాలు మోపుతోంది. ఈ కేసులో చంద్రబాబు (Chandrababu Naidu), లోకేష్ (Nara Lokesh), మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి నేడు నారా లోకేష్ సీఐడీ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారిని మార్చడం చర్చనీయాంశమైంది.

ALSO READ: రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ మార్పు.. ఈసీ కీలక ప్రకటన!

Advertisment
తాజా కథనాలు